Ravi Teja: రవితేజ చేయబోయే నెక్స్ట్ 2 సినిమాల మీద వీడిన సస్పెన్స్.. డైరెక్టర్స్ ఎవరంటే..?

ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'మిస్టర్ బచ్చన్ ' అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి మరోసారి తను ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.

Written By: Gopi, Updated On : May 19, 2024 1:42 pm

Ravi Teja

Follow us on

Ravi Teja: సినిమా ఇండస్ట్రీకి సోలోగా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోగా ఎదిగి, వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఒకే ఒక్క హీరో రవితేజ…ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దుసుకెళ్తున్నాయి. అయితే రవితేజ సినిమాలో ఉన్నాడు అంటే చాలు అతని అభిమానులు ఆ సినిమాని చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇంతకు ముందు చేసిన మూడు సినిమాలు పెద్దగా సక్సెస్ ని సాధించలేకపోయాడు.

అయినప్పటికీ ఆయన సినిమాల మీద జనాల్లో మంచి అంచనాలైతే ఉంటాయి. ఇక ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘మిస్టర్ బచ్చన్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి మరోసారి తను ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఇక ఆయన తర్వాత చేయబోయే సినిమాల మీద కూడా ఇండస్ట్రీలో చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే అనుదీప్ డైరెక్షన్ లో ‘దొంగ పోలీస్’ అనే కాన్సెప్ట్ తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఒక యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో కూడా సినిమా చేయడానికి తను సిద్ధం కాబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రవితేజ లాంటి స్టార్ హీరో నుంచి ఒక సినిమా వస్తుందంటే దాదాపు 100 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఆయన చేసిన ధమాకా సినిమా 100 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి రవితేజ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.

ఇక ఆ తర్వాత రవితేజ వరుస ప్లాప్ లతో మార్కెట్ కొంచెం తగ్గినట్టుగా అనిపించినప్పటికీ మిస్టర్ బచ్చన్ సినిమాతో తనకు పూర్వ వైభవం వస్తుందని రవితేజ బాగా నమ్ముతున్నాడు.