Pushpa Raj Step Back: ‘తగ్గెదెలే’ అంటూ కరోనా సమయంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్ ‘పుష్ప’ డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఎప్పటిలాగే బన్నీ ఫ్యాన్స్ ఈమూవీ తెగ నచ్చేసింది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడనే టాక్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మూవీకి వచ్చిన హైప్ కు సినిమా చూసిన తర్వాత వచ్చిన టాక్ కు మాత్రం పొంతన లేకుండా పోయింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘పుష్ప’ మూవీ తొలిరోజే రూ.72కోట్ల మేర వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2021లో తొలిరోజు ఇంత వసూళ్లు చేసిన మూవీ లేదని ‘పుష్ప’ మూవీ మేకర్స్ చెబుతున్నారు. దీంతో తొలి వారంరోజులు ‘పుష్ప’ కు ఢోకా ఉండదని టాక్ నడుస్తోంది. అయితే ఆ తర్వాతే ‘పుష్ప’కు అగ్నిపరీక్ష మొదలు కానుందనే ప్రచారం జరుగుతోంది.
దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశించాడు. కానీ ప్రస్తుతం ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ సాధించడమే గొప్ప విషయమనే టాక్ అభిమానుల్లో విన్పిస్తోంది. చిత్రానికి వచ్చిన డివైడ్ రెస్పాన్స్ త్వరలో తీయబోయే ‘పుష్ప-2’ పై పడినట్లుగా కన్పిస్తోంది. ‘పుష్ప’ పార్ట్-1 చూశాక చాలామంది ఈ చిత్రానికి సెకండ్ పార్ట్ తీయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
‘పుష్ప’ ప్రారంభించినప్పుడు దర్శకుడు ఒకే పార్ట్ గా సినిమాను తీయాలని భావించాడు. అయితే కరోనా కారణంగా చిత్రం ఆలస్యం అవుతున్న తరుణంలో ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఆలోచన వచ్చింది. దీంతో అసలు కథలో కొన్ని మార్పులు చేర్పి ‘పుష్ప’ తొలి పార్ట్ ను కంప్లీట్ చేశారు. ‘బాహుబలి’ తరహాలోనే ఈ మూవీని సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు.
సినిమా కథ పరిధి ఎక్కువ కావడంతో ‘పుష్ప-2’కు ప్లాన్ చేశాడా? లేదా ఆదాయం కోసం ఇలా చేశారా? అనేది సందేహాలు మాత్రం అభిమానుల్లో ఉన్నాయి. అయితే ఈ మూవీ చూసిన వాళ్లు మాత్రం సెకండాఫ్‌లో ఫాహద్ ఫాజిల్ పాత్రను ముందే ప్రవేశపెట్టిందని, హీరోకు, అతడికి వైరాన్ని చూపించి చివర్లో హీరో గెలిచేట్లు చూపించాల్సి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘పుష్ప’కు డివైడ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ విజయంపై సందేహాలు కలుగుతున్నాయి. తొలి వారం కలెక్షన్లకు ఢోకా లేకున్నా ఆ తర్వాత చిత్రం నిలబడుతుందో లేదో తెలియడం లేదు. ఈ మూవీ మీద భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్ల పరిస్థితి ఏంటో కూడా అర్థం కావడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి సెకండ్ పార్ట్ తీయాలా? లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్రేక్ ఈవెంట్ తీస్తే ఎలాగోలా ‘పుష్ప-2’ను పట్టాలెక్కించవచ్చు. కానీ నష్టలొస్తే మాత్రం ‘పుష్ప’కు సీక్వెల్ అటెకెక్కించమే బెటరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాగో ఈ మూవీ సెకండ్ పార్ట్ మొదలు కాలేదు కాబట్టి ‘తగ్గెదెలే’ అన్న ఓవర్ కాన్ఫిడెంట్ కు పోకుండా ‘పుష్ప-2’ ఆలోచన విరమించుకుంటే నిర్మాతకే మంచిదనే అభిప్రాయం వ్యకమవుతోంది.