Ravi Teja Horror Movie: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) లో చాలా గట్టి మార్పు వచ్చింది. స్క్రిప్ట్స్ ఎంపిక విషయం లో ఇక జాగ్రత్తలు తీసుకోకుంటే కెరీర్ ముగిసిపోతుంది అనే విషయం ఆయనకు స్పష్టంగా అర్థమైంది. అందుకే ఇంతకు ముందు లాగా కాకుండా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ, కంటెంట్ పరంగా మాత్రం బాగానే ఉంది అనే టాక్ ని తెచ్చుకుంది. రవితేజ గత చిత్రాల ఫలితాలు తాలూకా ప్రభావం ఈ సినిమా మీద బలంగా పడడంతో పాటు, ఈ చిత్రం తో పాటు విడుదలైన మిగిలిన సంక్రాంతి సినిమాలకు దీనికంటే మంచి పాజిటివ్ టాక్ రావడం వల్ల కమర్షియల్ గా దెబ్బ తినాల్సి వచ్చింది. కానీ రవితేజ లో వచ్చిన ఈ మార్పు మాత్రం చాలా గొప్పది.
అందులో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఆయన చాలా గట్టిగా కం బ్యాక్ ఇచ్చే సినిమాలనే ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన శివ నిర్వాణ దర్శకత్వం లో ‘ఇరుముడి’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రవితేజ ఒక కూతురుకి తండ్రిగా కనిపించబోతున్నాడు. ఆమె కోసం జీవితం లో ఆయన ఎలాంటి సంఘటనలు అయినా ఎదురుకోవడానికి సిద్ధం అనే విధంగా ఆ క్యారెక్టర్ ఉంటుందట. అదే విధంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయట. పాన్ ఇండియా లెవెల్ లో ఆ చిత్రం తెరకెక్కనుంది. ఇక ‘సరిపోదా శనివారం’ చిత్రం తో భారీ కమర్షియల్ హిట్ ని అందుకున్న వివేక్ ఆత్రేయ తో ఒక హారర్ జానర్ సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడట రవితేజ.
ఇందులో SJ సూర్య విలన్ గా నటిస్తాడని టాక్. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని కాన్సెప్ట్ తో ఈ హారర్ జానర్ సినిమా ఉండబోతుంది అట. థియేటర్స్ లో ఆడియన్స్ కి సరికొత్త అనుభూతి ని ఇవ్వనుంది ఈ చిత్రం. వివేక్ ఆత్రేయ సినిమాలు చాలా వైవిధ్యంగా , మినిమం గ్యారంటీ అనే రేంజ్ లో ఉంటాయి కాబట్టి, ఈ సినిమా మీద కూడా రవితేజ అభిమానులు ఆశలు పెట్టుకోవచ్చు. ఈ చిత్రం తర్వాత మ్యాడ్ సిరీస్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో ఒక సూపర్ హీరో జానర్ చిత్రం, ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి తో ఒక భారీ మల్టీస్టార్రర్, ఇలా చెప్పుకుంటూ పోతే మంచి సాలిడ్ సినిమాలతో తన కెరీర్ చివరి రోజుల్లో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాడు రవితేజ. చూడాలి మరి మాస్ మహారాజ ని ఆడియన్స్ ఒకప్పటి లాగా ఆదరిస్తారో లేదో అనేది.