Rashmika sensational comments on co stars: మన సౌత్ లోనే కాదు , నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందాన(Rashmika Mandanna). టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ , ‘పుష్ప’ చిత్రం ద్వారా ఈమె పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈమె బాలీవుడ్ లో ‘యానిమల్’, ‘పుష్ప 2’ , ‘చావా’ వంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్స్ తో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో ‘కాట్ టైల్ 2’ అనే చిత్రం చేస్తోంది. 2012 వ సంవత్సరం లో విడుదలైన ‘కాట్ టైల్’ చిత్రానికి ఇది సీక్వెల్. సైఫ్ అలీ ఖాన్ , దీపికా పదుకొనే , డియానా పేంటీ, డింపుల్ కపాడియా , బోమన్ ఇరానీ, రణదీప్ హూడా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం లో ఆరోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సెన్సేషన్.
ఈ చిత్రానికి హోమీ అడజానియా దర్శకత్వం వహించారు. ఇప్పుడు దాదాపుగా 14 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘కాక్ టైల్ 2’ తెరకెక్కుతోంది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందాన కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి కూడా హోమీ అడజానియా నే దర్శకత్వం వహించారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే రీసెంట్ గా రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో ఒక వీడియో ని అప్లోడ్ చేస్తూ షాహిద్ కపూర్, కృతి సనన్ లను సైకోలుగా అభివర్ణించింది.
సాంగ్ రిహార్సల్స్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ని షేర్ చేస్తూ ‘అలీ కునాల్ , దియా చిన్న సైజు సైకోలు, అందుకు ఆధారం ఇదే చూడండి’ అంటూ మేకింగ్ వీడియో ని , అదే విధంగా రిహార్సల్స్ వీడియో ని షేర్ చేసింది రష్మిక. ఈ చిత్రం పై ఇప్పటికే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది , మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాకు ఇంకా ఎంత క్రేజ్ ఏర్పడుతుందో చూడాలి. ‘కాక్ టైల్’ చిత్రం ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, కానీ ‘కాక్ టైల్ 2’ లో రష్మిక, కృతి సనన్ లెస్బియన్స్ గా నటించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్, ఇందులో ఎంత మాత్రం నిజముందో ట్రైలర్ విడుదల చేస్తే కానీ తెలియదు.