Double Ismart Teaser Review: 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్. ఏకంగా రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన చిత్రం ఇది. పూరి జగన్నాధ్ ఏళ్ల తర్వాత సక్సెస్ చూశాడు. ఈ చిత్ర నిర్మాత కూడా ఆయనే కావడంతో పూరి-ఛార్మి పోగొట్టుకున్నవన్నీ తిరిగి రాబట్టుకున్నారు. పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబోలో ఇది ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ నేపథ్యంలో డబల్ ఇస్మార్ట్ ప్రకటించారు. మొదటి పార్ట్ కి ఇది కొనసాగింపు అని చెప్పాలి. నేడు హీరో రామ్ పోతినేని బర్త్ డే కాగా డబల్ ఇస్మార్ట్ టీజర్ విడుదల చేశారు.
దాదాపు ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న డబల్ ఇస్మార్ట్ టీజర్ ఆకట్టుకుంది. మాస్ రోల్ లో రామ్ పోతినేని కేక పుట్టించాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, లుక్ హైలెట్ అని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ లో క్రాక్ చూపించిన రామ్ పోతినేని ఈసారి డబుల్ క్రాక్ అన్నట్లుగా ఉన్నాడు. డైలాగ్స్ లో డబుల్ మీనింగ్ డోస్ పెంచారు. బూతులు బాగా వాడేశారు. ఊరమాస్ రోల్ అని ప్రేక్షకులకు చెప్పేందుకు ఆ తరహా డైలాగ్స్ రాసుకొని ఉండొచ్చు.
టీజర్లో మరొక హైలెట్ సంజయ్ దత్. ఈ సినిమాకు ఆయన చాలా ప్లస్ అవుతాడు అనడంలో సందేహం లేదు. ఒక బలమైన విలన్ గా ఆయన పాత్ర పవర్ఫుల్ గా ఉండే సూచనలు కలవు. స్టైలిష్ విలన్ గా ఆయన లుక్ ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. టీజర్లో హీరోయిన్ ని పెద్దగా చూపించలేదు. ఆలీ చాలా కాలం తర్వాత మంచి కామెడీ రోల్ చేస్తున్నాడు అనిపిస్తుంది.
మొత్తంగా రామ్ పోతినేని ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో డబల్ ఇస్మార్ట్ తెరకెక్కుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మణిశర్మ బీజీఎమ్ కూడా మెప్పించింది. ఫ్యాన్స్ కి రామ్ పోతినేని బర్త్ డే గిఫ్ట్ అదిరింది. రామ్ పోతినేని 1988 మే 15న జన్మించాడు. నేడు ఆయన 36వ ఏట అడుగుపెడుతున్నారు. దాంతో చిత్ర ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరో వైపు ఏజ్ బార్ అవుతున్నా రామ్ పోతినేని వివాహం చేసుకోవడం లేదు.