Rajamouli: పాన్ ఇండియాలో దర్శక ధీరుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాను పాన్ వరల్డ్ లో రూపొందించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా అభిమానులు తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి? అనే విషయాలను తెలుసుకోవడానికి మహేష్ అభిమానులతో పాటు, సగటు ప్రేక్షకుడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అయితే రాజమౌళి ఎప్పుడైనా కూడా తను ఒక సినిమా స్టార్ట్ చేసే ముందు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి ఆ సినిమాకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇక ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే రాజమౌళి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే కథ మొత్తం ఒక కొలిక్కి వచ్చినప్పటికీ, మాటలు మాత్రం బ్యాలెన్స్ గా మిగిలిపోయాయి.
ఇక వాటిని కూడా ఫినిష్ చేయించి తొందర్లోనే ప్రెస్ మీట్ ను పెట్టబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈసారి రాజమౌళి కొంచెం అడ్వాన్స్డ్ గా వ్యవహరిస్తున్నట్లు గా తెలుస్తుంది. అది ఏంటి అంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ వీడియోని చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక్కడు తప్ప మిగిలిన ఏ క్యారెక్టర్లు కూడా ఫైనలైజ్ కాకపోవడం వల్ల మహేష్ బాబు ని మెయిన్ గా పెట్టి ఆ కాన్సెప్ట్ ని డిజైన్ చేసి రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే సినిమా ఎలా ఉండబోతుందో రాజమౌళి మనకు ముందే కాన్సెప్ట్ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాడు. ఇక ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు లుక్కు కు సంబంధించిన చాలా స్కెచ్ లను వేయించి దాంట్లో మహేష్ బాబుకి సెట్ అయ్యే లుక్కుని ఫైనలైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమాకి సంబంధించిన లుక్ లోకి మారడానికి విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది…