OG Movie: ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు సినిమాల హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క అభిమాని ఓజీ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాల విషయంలో ఎలాగైనా సరే భారీ సక్సెస్ లను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ బిజీలో ఉండటం వల్ల ఆయన షూటింగ్ లో పాల్గొనడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న డేట్ కి వచ్చే విధంగా కనిపించడం లేదు.ఇక ఈ సినిమాని క్రిస్మస్ పండగ రోజు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాని అప్పుడు కనక రిలీజ్ చేసినట్లయితే క్రిస్మస్ రోజున ఆల్రెడీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన నాగ చైతన్య ‘తండేల్ ‘, నితిన్ ‘రాబిన్ హుడ్ ‘ సినిమాలను ఇంకొక డేట్ కి రిలీజ్ చేసుకోక తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి పోటీగా వచ్చే సాహసం వాళ్ళు చేయలేరు. ఒకవేళ వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా ముందు వీళ్ళ సినిమాలు నిలబడే అవకాశాలు కూడా చాలా తక్కువ కాబట్టి పవన్ దెబ్బకి వీళ్ళు వాళ్ళ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక పవన్ కళ్యాణ్ ఆ డేట్ కి రావడం వల్ల ఈ హీరోలతో పాటు మిగతా కొంతమంది కూడా తమ తమ సినిమాలా రిలీజ్ డేట్లను మార్చుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన 15 రోజుల వరకు మామూలుగా ఏ సినిమా రిలీజ్ చేసిన అంత పెద్ద సక్సెస్ అయితే సాధించదు. కాబట్టి రెండు వారాల వరకు ఈ సినిమా మీద అందరి ఫోకస్ ఉంటుంది…