OG Movie Updates: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానుల 12 ఏళ్ళ ఆకలి ని తీర్చిన చిత్రం ‘ఓజీ'(They Call Him OG). భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాతలు నాలుగు రోజుల్లో 254 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. రాబోయే రోజుల్లో దసరా సెలవులు ఉండడంతో 300 కోట్ల గ్రాస్ మార్కుని దాటి కచ్చితంగా 400 కోట్ల క్లబ్ లోకి లాంగ్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా చేరుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. సోమవారం రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా సెన్సేషనల్ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ సినిమా. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం సోమవారం రోజున ఈ చిత్రానికి కచ్చితంగా తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు.
అంతా బాగానే ఉంది కానీ, ఈ చిత్రానికి A సర్టిఫికేట్ చేస్తున్న నష్టం సాధారణమైనది కాదు. అనేక సెంటర్స్ లో చిన్న పిల్లలకు ఈ సర్టిఫికేట్ కారణంగా థియేటర్ లోకి ఎంట్రీ దొరకడం లేదు. ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉన్నది చిన్న పిల్లల్లోనే. వాళ్ళకే మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఎంట్రీ లేకపోతే ఇక ఏ రేంజ్ నష్టం ఉంటుందో మీరే ఊహించుకోండి. సింగల్ స్క్రీన్స్ ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి నష్టం లేదు కానీ, ఒక్క సింగల్ స్క్రీన్ థియేటర్ కూడా లేని నెల్లూరు లాంటి సెంటర్స్ లో భారీ నష్టాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తోనే ముందుకు దూసుకెళ్లడం గమనార్హం. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇలా వీకెండ్ తర్వాత హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని చూసి చాలా కాలం అయ్యింది.
వకీల్ సాబ్ చిత్రానికి ఈ రేంజ్ రన్ ఉండేది కానీ, ఆ సమయం లో కరోనా విలయ తాండవం ఆడుతుండడంతో ఆ చిత్రానికి లాంగ్ రన్ మిస్ అయ్యింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ అక్టోబర్ 1న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు. ఈ సంబరాల్లో పవన్ కళ్యాణ్ కూడా భాగం కాబోతున్నాడట. అంతే కాదు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా విచ్చేసే అవకాశాలు ఉన్నాయట. త్వరలోనే నిర్మాతలు ఆయన్ని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నారు. పవన్ కళ్యాణ్ మరియు మెగా అభిమానులకు మరో పండుగ లాంటి ఈవెంట్ గా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ మారబోతుంది. అంతే కాదు ఈ ఈవెంట్ వల్ల కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.