Sreeleela: కన్నడ బ్యూటీ శ్రీలీల మొన్నటి వరకు క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసింది. నెలలు, రోజుల వ్యవధిలో ఆమె నటించిన సినిమాలు విడుదలయ్యాయి. అయితే భగవంత్ కేసరి మినహా ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. గత ఏడాది విడుదలైన స్కంద, ఎక్సట్రార్డినరీ మ్యాన్, ఆది కేశవ డిజాస్టర్లు గా నిలిచాయి. దీంతో అమ్మడి కెరీర్ కాస్త స్లో అయింది. దీంతో ఆచి తూచి అడుగులు వేస్తునట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ లో శ్రీలీలకు ఆఫర్స్ తగ్గాయి. మేకర్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో శ్రీలీల కీలక నిర్ణయం తీసుకుందట. ఆమె కోలీవుడ్ పై దృష్టి పెట్టిందట. అక్కడ స్టార్ గా ఎదగాలని అనుకుంటుందట. ఈ క్రమంలో ఓ గోల్డెన్ ఛాన్స్ సైతం పెట్టేసిందట. కోలీవుడ్ స్టార్ అజిత్ కి జంటగా ఎంపికైందట. గత ఏడాది అజిత్ తునివు చిత్రంలో నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం విడామయుర్చి సినిమా చేస్తున్నారు.
అనంతరం అజిత్ .. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి ‘ గుడ్ బ్యాడ్ అగ్లీ ‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అజిత్ మూడు గెటప్ లలో కనిపించనున్నారు. అజిత్ సరసన శ్రీలీల నటిస్తున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం అజిత్ బైక్ పై విదేశాలు చుట్టొచ్చే పనిలో ఉన్నారు. వచ్చిన వెంటనే అజిత్ 63 వ సినిమా ప్రారంభించనున్నారని సమాచారం.
అజిత్ మూవీలో శ్రీలీల నటిస్తున్నట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. శ్రీలీల నటిస్తున్న ఏకైక తెలుగు మూవీ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా షూటింగ్ కి కాస్త గ్యాప్ వచ్చింది. గుంటూరు కారం తర్వాత మరో సినిమాలో శ్రీలీల కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.
Web Title: Nil offers in telugu sreeleela unexpected decision
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com