Ravi Teja: రవితేజ పారితోషికం పై ఇండస్ట్రీలో నెగిటివ్ టాక్ రోజురోజుకు ఎక్కువైపోతోంది. నిర్మాతలకు రవితేజ నుంచి ఎక్కువ డిమాండ్స్ వెళ్తున్నాయని.. గతంలో కంటే కూడా.. ఈ మధ్య రవితేజ ఎక్కువ కక్కుర్తి పడుతున్నాడని ఇలా సాగుతున్నాయి రవితేజ పై వార్తలు. ముఖ్యంగా ఆటో మీటర్ కన్నా స్పీడ్ గా తిరుగుతుంది రవితేజ రెమ్యునరేషన్ వ్యవహారం.

నిజానికి రవితేజ ఉన్నట్టు ఉండి, ఇలా పారితోషికం విషయంలో ఎక్కువ డిమాండ్ చేయడానికి కారణం.. తోటి హీరోలకు తనకు బాగా వ్యతాసం ఉందని. ఏడాది క్రితం వరకు రవితేజకు అన్నీ అపజయాలే వచ్చాయి. దాంతో మిగిలిన హీరోలు పారితోషికాన్ని పెంచిన సమయంలో రవితేజ పెంచలేదు. ఇక కెరీర్ కూడా ముగిసింది అనుకున్న సమయంలో ఈ ఏడాది ‘క్రాక్’ సినిమా విడుదల అయి అద్భుత విజయాన్ని అందుకుంది.
ఆ సినిమాకు రవితేజ తీసుకున్నది 6 కోట్లు. అయితే, ఆ కోట్లు నుంచి 12 కోట్లకు పెంచాడు. సరే.. హిట్ వచ్చింది కదా.. నిర్మాతలు కూడా అడిగినంత ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఒక్కో సినిమాకు రవితేజ 15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాకి 15 కోట్లు పట్టుబట్టి వసూళ్లు చేశాడు. ఇక రీసెంట్ గా దర్శకుడు నక్కిన త్రినాధరావు ‘ధమాకా’ సినిమా స్టార్ట్ చేశాడు.
ఈ సినిమా ఎప్పుడో రెండేళ్ల క్రితం ఫిక్స్ అయిన సినిమా. అప్పుడు లెక్కల ప్రకారం.. 8 కోట్లు ఇస్తామని నిర్మాత కమిట్ అయి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. సరే.. ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నాడు కాబట్టి.. 15 కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాత అంగీకరించాడు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకి 16 కోట్లు అడుగుతున్నాడట. పారితోషికం విషయంలో రవితేజ ఇలా మాట మారుస్తూ పోవడం నిర్మాతలకు తీవ్ర ఇబ్బంది అయింది.
Also Read: Tollywood: ఫుల్ ఫామ్ లో దూసుకువెళ్తున్న టాలీవుడ్ సీనియర్ హీరోలు…
రవితేజ సినిమాల లిస్ట్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది, అలాగే వంశీకృష్ణ అనే మరో దర్శకుడితో మరో సినిమా ఉంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. ఈ సినిమాలలో ఒక్కో సినిమాకు రవితేజ. 18 కోట్లు పారితోషికం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. మొత్తానికి రవితేజ వ్యవహారం నిర్మాతలకు తీవ్ర అభ్యంతరకరం అయిపోయింది.
Also Read: Actress Samantha: ఎక్కువ సమయం బెడ్ రూమ్ లో గడుపుతాను అంటున్న సమంత…