Nagarjuna warning to Peddi team: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సాధారణంగా ఒక సినిమా పై బలమైన నమ్మకం చూపుతూ తొడలు కొట్టడం వంటి సంఘటనలు , గడిచిన మూడు దశాబ్దాల్లో చాలా అరుదుగా చూసి ఉంటాం. ‘సోగ్గాడే చిన్న నాయనా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో , ఈ సంక్రాంతికి వస్తున్నాం, కొడుతున్నాం , అంటూ చాలా బలమైన నమ్మకం తో చెప్తాడు. ఆ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మనమంతా చూశాము . ఎన్ని సినిమాలు ఆ చిత్రానికి పోటీగా నిలబడినా, ఆరోజుల్లోనే 50 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లను రాబట్టి, సంచలనం సృష్టించింది ఈ చిత్రం. అంతకు ముందు విడుదలైన ‘మనం’, ‘ఊపిరి’ చిత్రాలకు కూడా ఇలాగే చెప్పాడు , వాటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది , ఇప్పుడు ‘లెనిన్'(Lenin Movie) విషయం లో కూడా అంతే గట్టి నమ్మకం తో చెప్తున్నాడు.
ఆయన మాట్లాడుతూ ‘నిన్ననే లెనిన్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ కాపీ ని చూసాను. చాలా గర్వం తో , నమ్మకంతో చెప్తున్నాను, జూన్ 26 న సరికొత్త అఖిల్ ని మీరంతా చూడబోతున్నారు, రాసిపెట్టుకోండి. థియేటర్స్ లో చూసుకుందాం’ అంటూ ఒక ట్వీట్ వేశాడు. ఈ ట్వీట్ కి సోషల్ మీడియా నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా అఖిల్ సరైన హిట్ ని అందుకోలేకపోయాడు. అక్కినేని లేజసి డేంజర్ లో పడిందని అభిమానులు బాధ పడుతున్న సమయం లో ‘లెనిన్’ చిత్రం ప్రకటించినప్పటి నుండే వారిలో సరికొత్త నూతనోత్సాహం వచ్చింది. అయితే ఇప్పుడు నాగార్జున వేసిన ట్వీట్ ని చూసి, ఈసారి మా అఖిల్ బాబు కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడు అంటూ అక్కినేని ఫ్యాన్స్ ట్వీట్స్ వేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.
అంతే కాదు , నాగార్జున ‘పెద్ది’ టీం కి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు అయ్యింది. ముందుగా ‘లెనిన్’ చిత్రాన్ని మే 1 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ ఏప్రిల్ 30 న రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఉండడం తో , చరణ్ కి , అఖిల్ కి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని , మేము ‘లెనిన్’ చిత్రాన్ని జూన్ 26 కి వాయిదా వేస్తున్నాము అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30 నుండి జూన్ నెలకు వాయిదా పడింది. రీసెంట్ గా ఆ చిత్ర డైరెక్టర్ బుచ్చి బాబు ఒక ఈవెంట్ లో ‘పెద్ది’ ని జూన్ 25 న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఇది ‘లెనిన్’ టీం కి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. మరోసారి ఈ చిత్రం వాయిదా పడుతుందని అనుకున్నారు కానీ , ఈసారి వెనక్కి తగ్గేదే లేదని, దమ్ముంటే రండి అని నాగార్జున చెప్పకనే చెప్పాడు అంటున్నాడు నెటిజెన్స్.
watched the first cut of our film LENIN last night.
I say this with confidence and pride… you are about to witness a new AKHIL on June 26 2026.
mark the date!!!
see you in the theatres— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 29, 2026