Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi- Ram Charan- Pawan Kalyan: ఒకే రూట్లో చిరంజీవి, రామ్ చరణ్.. ఇపుడు పవన్...

Chiranjeevi- Ram Charan- Pawan Kalyan: ఒకే రూట్లో చిరంజీవి, రామ్ చరణ్.. ఇపుడు పవన్ కళ్యాణ్

Chiranjeevi- Ram Charan- Pawan Kalyan: చారిత్రాత్మక చిత్రాలు తీయడం తెలుగు వారికి కొత్తేమీ కాదు. గతంలో అన్ని సినిమాలు చారిత్రాత్మక నేపథ్యం ఉన్నవే తీసేవారు. వాటికి ప్రజాదరణ కూడా మామూలుగా ఉండేది కాదు. అప్పట్లో విఠలాచార్య సినిమాల్లో ఇలాంటి కథలు కోకొల్లలు. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు ప్రస్తుతం ప్రేమ కథా చిత్రాల సంఖ్య పెరిగిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి వారు చారిత్రాత్మక సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు అప్పట్ల బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Chiranjeevi- Ram Charan- Pawan Kalyan
Chiranjeevi- Ram Charan- Pawan Kalyan

ఇలా చారిత్రాత్మక కథలతోనే వారు రాణించారు. ఇప్పుడు ట్రెండు కూడా అటు వైపు వెళుతోంది. మన వారు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథలనే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. దీంతోనే హిట్లు సాధిస్తున్నారు. దీనికి ఉదాహరణ ఇటీవల వచ్చిన బింబిసార.

Also Read: Mahesh Babu Mother Passes Away: మహేష్ బాబు తల్లి మృతి: చిరంజీవి సహా సినీ ప్రముఖుల సంతాపం

చిరంజీవి నుంచి చిన్న నటుల వరకు చారిత్రాత్మక కథల కోసమే చూస్తున్నారు. గతంలో రాంచరణ్ మగధీరతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చిరంజీవి సైరా నరసింహారెడ్డితో అలరించారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో ఒదిగిపోయి నటించి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు.
దీంతో మన హీరోలు చారిత్రాత్మక కథల కోసమే ఆరాట పడుతున్నారు. వాటిలో ఉండే కథనం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అందుకే అవి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా అదే కోవలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన రాబోయే సినిమా హరిహర వీరమల్లు, ఇంకా హరీశ్ శంకర్ తో తీసే భవదీయుడు భగత్ సింగ్ కూడా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలే అని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సైతం అన్నయ్య, అబ్బాయి బాటలోనే నడవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

హరిహర వీరమల్లు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్ ఇదివరకు బాలకృష్ణ తో గౌతమీ పుత్ర శాతకర్ణి తీసి శభాష్ అనిపించుకున్నాడు. ఇంకా గుణశేఖర్ రుద్రమదేవి తీసి తెలుగు వారి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు.

Chiranjeevi- Ram Charan- Pawan Kalyan
Chiranjeevi- Ram Charan- Pawan Kalyan

ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంపై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే మొదటి చారిత్రాత్మక చిత్రం కావడంతో అందరికి ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లు ఇలాంటి నేపథ్యమున్న సినిమా పవన్ కల్యాణ్ కు రాకపోవడంతో ఎలా ఉంటుందోననే ఆతృత వస్తోంది. పవన్ కల్యాణ్ నటన సినిమాలో ఏ మేరకు ఉంటుందోననే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి చారిత్రక నేపథ్యంతో సాగే సినిమాలో పవన్ కల్యాణ్ తన ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. తనదైన నటనతో ఆకట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి సినిమా అయినా అలవోకగా నటించి అందరిని మెప్పించే సత్తా ఆయన సొంతమే.

Also Read: Manchu Vishnu: మంచు విష్ణు పై ట్రోల్స్ వెనుక ఓ స్టార్ హీరో ?.. విష్ణు సంచలన కామెంట్స్ !

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version