Makar Sankranti 2022: మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్లోని మిగతా హీరోలు ఎలా ఉన్నప్పటికీ చిరంజీవి మాత్రం ఫ్యామిలీ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. సినిమాల్లో ఎంత బీజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి మాత్రం సమయాన్ని కేటాయిస్తూనే ఉంటారు.

ఇక పండుగలు, పబ్బాల్లాంటి వస్తే చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపిల్లాడిలా మారిపోతుంటారు. ముఖ్యమైన పండుగలకు మెగా ఫ్యామిలీ ఒక్కచోట చేరి సెలబ్రేషన్ చేసుకోవడం అనవాయితీగా వస్తోంది. 2022 ఏడాది సంక్రాంతి వేడుకల కోసం మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఈరోజు ఉదయాన్ని బోగి మంటలను మొదలుపెట్టి సంక్రాంతి సెలబ్రేషన్స్ ను మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మొదలు పెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసి అభిమానులతో తన సంబరాన్ని పంచుకున్నాడు.
ఈ వేడుకల్లో భాగంగా చిరంజీవి, వరుణ్ తేజ్ లు తమ కుటుంబ సభ్యుల కోసం చెఫ్ లుగా మారి దోశలు వేశారు. చిరంజీవి కంటే వరుణ్ తేజ్ దోశ బాగా వేయడంతో పక్కనే ఉన్న చిరు అతడితో చిల్లపిల్లడిలా గొడవపడ్డాడు. ‘అది సరిగా రాలేదు.. నాకు కుళ్లు వచ్చేసింది.. ఇది దోశ కాదు ఉప్మా’ అంటూ వరుణ్ వేసిన దోశను చిరంజీవి గరిటెతోచెడగొట్టాడం హైలెట్ గా నిలిచింది. ఇక ఈ వీడియోను వరుణ్ తేజ్ ‘బాస్‌తో 101వ దోశ’ అంటూ క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో లైక్స్ వచ్చాయి.
View this post on Instagram