K-Ramp Movie 2 days Collections: ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో విడుదలైన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘K ర్యాంప్'(K Ramp Movie) చిత్రం, నిన్న ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దీపావళి కి విడుదలైన సినిమాల్లో ‘డ్యూడ్’ చిత్రం కచ్చితంగా విజేతగా నిలుస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే మొదటి నుండి ఈ చిత్రం పై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. హీరో కి అంతకు ముందు వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి,దానికి తోడు టీజర్,ట్రైలర్, పాటలు పెద్ద హిట్ అవ్వడంతో కచ్చితంగా భారీ హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ రావడం, L ర్యాంప్ చిత్రానికి కాస్త పాజిటివ్ టాక్ రావడంతో నిన్న అన్ని ప్రాంతాల్లోనే ఈ చిత్రం తిరుగులేని డామినేషన్ ని చూపిస్తూ ముందుకు దూసుకుపోయింది. మొదటి రోజు కంటే రెండవ రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దాం.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో కూడా ఈ చిత్రానికి మొదటి రోజు 47 వేల టిక్కెట్లు అమ్ముడుపోతే, రెండవ రోజున ఏకంగా 64 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ రేంజ్ జంప్ మిగిలిన దీపావళి సినిమాల్లో కనపడలేదు. సీడెడ్ లో అయితే డ్యూడ్ చిత్రాన్ని ‘K ర్యాంప్’ డబుల్ మార్జిన్ తో గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు బాగానే ఉన్నాయి కానీ, ఓవర్సీస్ లో మాత్రం భారీ నష్టాలు తప్పేలా లేదు. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి నాలుగు లక్షల డాలర్లకు కొనుగోలు చేయగా, ఇప్పటి వరకు కేవలం లక్షా 20 వేల డాలర్లు వచ్చాయి.
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 5 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి పూర్తి స్థాయి హిట్ స్టేటస్ ని అందుకోవడానికి మరో కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. నేడు, రేపు పెద్ద పండుగలు కాబట్టి, ఈ రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని పూర్తిగా దాటేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు బయ్యర్స్. క తర్వాత కిరణ్ అబ్బవరం నుండి మంచి కమర్షియల్ హిట్ గా ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఇదే తరహా హిట్స్ ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తే, కిరణ్ అబ్బవరం యంగ్ హీరోలలో మరో ప్రామిసింగ్ హీరో గా నిలుస్తాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.