Jani Master: స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించే జానీ మాస్టర్ కూడా హీరో అయిపోవడానికి రెడీ అయ్యాడు. కొరియోగ్రాఫర్ లు హీరోలు అయిన సందర్బాలు ఉన్నాయి. ప్రభుదేవ నుంచి మొదలుపెడితే మన లారెన్స్ వరకూ డ్యాన్స్ మాస్టర్ లు హీరోలుగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు.

‘యథారాజా తథా ప్రజా’ అనే చిత్రంతో హీరోగా మారబోతోన్నాడు. శ్రీనివాస్ విట్టల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ మరో హీరోగా.. శ్రష్టి వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మిస్తున్నారు.
Also Read: ‘Liger’Memes : ‘పూరి’‘కొండన్నా’ ఏంటన్నా ఇదీ.. లైగర్ ఫ్లాప్ పై హోరెత్తుతున్న మీమ్స్..
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. హీరో శర్వానంద్ క్లాప్ కొట్టారు.

పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపబోతున్నారు. డ్యాన్స్, కమర్షియల్ అంశాలు కాకుండా మంచి కథతో రావడంతో జానీ మాస్టర్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని దర్శకుడు శ్రీనివాస్ తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Also Read: Cancer Screening: కోత కోయకుండానే కనిపెట్టొచ్చు: క్యాన్సర్ నిర్ధారణ ఇప్పుడు మరింత ఈజీ