Double Meaning: డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోయిన ‘జాతిరత్నాలు’

Double Meaning Dialogues: టీఆర్ఫీ రేటింగ్స్ పై దృష్టి పెట్టిన కొన్ని టీవీ ఛానళ్లు కామెడీ ప్రొగ్రాంల పేరుతో బూతు కంటెంట్ ను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మల్లెమాల సంస్థ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న షోలన్నీ కూడా ఈ కాన్సెప్ట్ తోనే వస్తున్నాయి. తొలినాళ్లలో మంచి కామెడీని అందించిన మల్లెమాల సంస్థ ఇటీవలీ కాలంలో ఎక్స్ ట్రా ఎంటటైన్మెంట్ పేరుతో సెన్సార్ కు దొరకని విధంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను జనాలకు రుద్దుతూ టీఆర్పీని పెంచుకుంటున్నాయి. మల్లెమాల […]

Written By: NARESH, Updated On : August 2, 2022 1:00 pm
Follow us on

Double Meaning Dialogues: టీఆర్ఫీ రేటింగ్స్ పై దృష్టి పెట్టిన కొన్ని టీవీ ఛానళ్లు కామెడీ ప్రొగ్రాంల పేరుతో బూతు కంటెంట్ ను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మల్లెమాల సంస్థ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న షోలన్నీ కూడా ఈ కాన్సెప్ట్ తోనే వస్తున్నాయి. తొలినాళ్లలో మంచి కామెడీని అందించిన మల్లెమాల సంస్థ ఇటీవలీ కాలంలో ఎక్స్ ట్రా ఎంటటైన్మెంట్ పేరుతో సెన్సార్ కు దొరకని విధంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను జనాలకు రుద్దుతూ టీఆర్పీని పెంచుకుంటున్నాయి.

మల్లెమాల నుంచి వచ్చిన జబర్దస్త్, ఎక్స్ జబర్దస్త్ షోలు తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. టీఆర్పీ ఈ కామెడీ షోలు దూసుకెళ్లడంతో నిర్వాహకులకు కాసులపంట పండింది. ఈ షో కాన్సెప్ట్ తో మరికొన్ని ఛానళ్లు సైతం కామెడీ షోలను తీసుకొచ్చాయి. అయితే జబర్దస్త్ మాదిరిగానే ఆకట్టుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి.

మరోవైపు మల్లెమాల సంస్థ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న దాదాపు అన్ని షోలు హిట్ అనిపించుకుంటున్నాయి. అయితే షో సరిగా పెర్ఫార్మ్ చేయడం లేదని భావించిన వెంటనే దానిని నిలిపివేయడానికి మల్లెమాల సంస్థ ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలోనే ‘జాతి రత్నాలు’ అనే షోను సైతం మల్లెమాల తీసుకొచ్చింది.

గతంలో శ్రీముఖి, యాంకర్ రవి హోస్టుగా చేసిన ‘పటాస్’ మాదిరిగానే ‘జాతిరత్నాలు’ ప్రొగ్రాం సైతం హిట్ అనిపించుకుంటోంది. జాతిరత్నాలకు యాంకర్ శ్రీముఖి హోస్టు చేస్తుండగా ఇమ్మానుయేల్, నూకరాజు, పంచ్ ప్రసాద్ వంటి వారు కంటెస్టెంట్లుగా అలరిస్తున్నారు. ఈ షోకు సంబంధించి తాజాగా వదిలిన ప్రోమోలో నూకరాజు ఒక డబల్ మీనింగ్ డైలాగ్ వేస్తే శ్రీముఖి కూడా వెంటనే ఏమాత్రం తడుముకోకుండా కౌంటర్ వేసింది.

అసలు విషయంలోకి వెళితే.. ఈ బ్యాచ్ అందరూ కలిసి ‘రంగస్థలం’ సినిమా స్పూఫ్ చేస్తారు. జగపతి బాబు పాత్రలో పంచ్ ప్రసాద్, చిట్టి బాబు పాత్రలో నూకరాజు, జబర్దస్త్ మహేష్ క్యారెక్టర్లో ఇమ్మానియేల్, సమంత క్యారెక్టర్లో శ్రీముఖి నటించింది. రామ్ చరణ్ చెవిటి పాత్రలో నూకరాజు కనిపించాడు. ఈక్రమంలోనే శ్రీముఖి వచ్చి తన పొలం సర్పంచి లాక్కున్నాడు అని వింత వింత ఎక్స్ప్రెషన్స్ తో చెబుతుంది.

శ్రీముఖి తన బాధ చెప్పుకునే ప్రయత్నం చేయగా నూకరాజుకు వినిపించనట్టే యాక్టింగ్ చేస్తాడు. ఆ తర్వాత అసలు విషయం చేసుకొని ‘సర్పంచ్ సంగతి చూసి నీ పొలం నీకు ఇప్పిస్తా అంటాడు.. అలా ఇప్పించినందుకు నాకేమైనా ఉందా అనే ఉద్దేశంతో నూకరాజు డబల్ మీనింగ్ డైలాగు’ వేస్తాడు. దీనికి శ్రీముఖి కూడా వెంటనే తడుముకోకుండా నీకేమైనా ఉందా లేదా నాకు ఎలా తెలుస్తుందా? నీకే తెలియాలి కదా.. అంటూ నూకరాజు పరువు తీస్తుంది. దీంతో అక్కడ ఉన్నవారంతా అక్కాయ్యారు. ఆ వెంటనే అంతా తేరుకొని అంతా నవ్వుకున్నారు.