Pavitra Lokesh: పవిత్ర లోకేష్ ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్న పేరు. పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నట్లు నటుడు నరేష్ ప్రకటించినప్పటి నుండి ఆమె పేరు మారుమ్రోగుతుంది. మహాబలేశ్వర్ ఆలయంలో వీరిద్దరికి వివాహం జరిగిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో నరేష్ స్పష్టత ఇచ్చారు. మీడియా ముఖంగా పవిత్ర లోకేష్, నేను కలిసి జీవిస్తున్న మాట వాస్తవమే కానీ పెళ్లి చేసుకోలేదు. వివాహ వ్యవస్థ పై నాకు నమ్మకం లేదు. పవిత్ర నమ్మదగిన అభిమానించే వ్యక్తి. మేమిద్దరం కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నాము. వివాహం చేసుకునేది లేనిదీ ఇప్పుడే చెప్పలేను, అని నరేష్ వెల్లడించారు.

దాదాపు రెండేళ్లకు పైగా నరేష్-పవిత్ర కలిసి ఉంటున్నట్లు సమాచారం. తాజాగా వీరు విడిపోయారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. మనస్పర్థల కారణంగా విడిపోయిన ఈ జంట విడివిడిగా ఉంటున్నారనేది లేటెస్ట్ టాక్. అదే సమయంలో నరేష్ మరో నటికి దగ్గరయ్యారట. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది. బ్రేకప్ వార్తల నేపథ్యంలో పవిత్ర లోకేష్ పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. దీంతో గతంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో పవిత్ర లోకేష్ హీరో నాగార్జున అంటే ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. నా మొదటి క్రష్ నాగార్జున అంటూ ఆమె చెప్పడం విశేషంగా మారింది. నాగార్జున కెరీర్లో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయిన గీతాంజలి మూవీ చూసి పవిత్ర పవిత్ర ఆయన్ని ఇష్టపడ్డారట. గీతాంజలి విడుదల నాటికి పవిత్ర 6వ తరగతి చదువుతున్నారట. ఆ మూవీలో నాగార్జునను చూడగానే క్రష్ ఫీలింగ్ కలిగిందని పవిత్ర చెప్పుకొచ్చారు. నాగార్జునతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఎంతగానో అభిమానిస్తారట.

రజినీకాంత్ ని పవిత్ర లైఫ్ లో ఒక్కసారే కలిశారట. అప్పుడు ఆయనతో దిగిన ఫోటో ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారట. కర్ణాటకకు చెందిన పవిత్ర కెరీర్ శాండల్ వుడ్ లో మొదలైంది. తెలుగులో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. 2003 నుండి విరివిగా తెలుగులో చిత్రాలు చేస్తున్నారు. నరేష్ కి దగ్గరయ్యాక ఆమెకు ఇక్కడ ఆఫర్స్ పెరిగాయి. నరేష్ నటించిన చాలా చిత్రాల్లో పవిత్ర లోకేష్ రోల్స్ చేశారు. నరేష్ తన పలుకుబడితో పవిత్రను సినిమాల్లో తీసుకునేలా చేసేవాడట.