Gabbar Singh re release overseas record: కొన్ని రికార్డ్స్ ని ఎంత ప్రయత్నం చేసినా అందుకోలేము, అందుకే అలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యినప్పుడు , ఆ తర్వాత రెండవ స్థానం లో నిలిచే రికార్డు ని ‘నాన్’ అనే పేరుతో సంబంధిస్తూ పిలుస్తుంటాం . గతం లో ‘నాన్ బాహుబలి’ అనే క్యాటగిరీ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా రీ రిలీజ్ సినిమాల విషయం లో ‘నాన్ గబ్బర్ సింగ్’ రికార్డు అని పిలవొచ్చు. ఎప్పుడో 2024 వ సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ రీ రిలీజ్ ఒక సెన్సేషనల్ , సోమవారం లాంటి వర్కింగ్ డే లో, భారీ వరదలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమయం లో విడుదలైనప్పటికీ కూడా ఈ సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు.
ఫలితంగా కేవలం మొదటి రోజే ఈ చిత్రానికి 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాదిన్నర కాలం లో ఎంతో మంది స్టార్ హీరోలకు సంబంధించిన రీ రిలీజ్ చిత్రాలు వచ్చాయి , కానీ ఒక్క సినిమా కూడా ee సినిమా గ్రాస్ వసూళ్లకు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ అతడు , ఖలేజా వంటి చిత్రాలతో ఈ రికార్డు ని బద్దలు కొడుతుందని అనుకున్నారు. కానీ ఆ సినిమాలు కూడా విఫలం అయ్యాయి. ఇకపోతే రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల ‘డార్లింగ్’ చిత్రం కచ్చితంగా ‘గబ్బర్ సింగ్’ గ్రాస్ ని అధిగమిస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా అయితే దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు. ముఖ్యంగా నార్త్ అమెరికా లో అయితే ‘గబ్బర్ సింగ్’ కి మొదటి రోజు వచ్చినంత వసూళ్ళలో సగం కూడా వచ్చేలాగా కనిపించడం లేదు. ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్క దాదాపుగా 22 వేల డాలర్లకు చేరింది.
‘గబ్బర్ సింగ్’ చిత్రానికి 48 వేల డాలర్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా , 60 వేల డాలర్లు షోస్ ముగిసిన తర్వాత మొదటి రోజున వచ్చాయి. కానీ డార్లింగ్ కి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. నైజాం లో అడ్వాన్స్ కూడా యావరేజ్ రేంజ్ లోనే ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంటున్నారు. ఇది కచ్చితంగా రికార్డు బ్రేకింగ్ కాదు , కానీ రీసెంట్ గా విడుదలైన సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పడం లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కానీ రికార్డ్స్ క్రియేట్ చేయడం లో మాత్రం ఈ సినిమా విఫలమైంది.