Bigg Boss 6 Telugu 7th Week Nomination: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీసన్ 6 ఇప్పుడు రోజుకో కొత్త మలుపులు తీసుకొని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది..ఈమధ్యనే ప్రారంభమైనట్టు అనిపిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆరు వారాలు పూర్తి చేసుకొని 7 వ వారం లోకి అడుగుపెట్టింది..ఈ 7 వ వారం లో ఎలిమినేషన్స్ కోసం జరగబడే నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా జరిగింది.

గత వారం లో లాగా ఈ వారం కూల్ గా అయితే నామినేషన్స్ జరగలేదు అనే చెప్పాలి..నిన్న బిగ్ బాస్ నుండి సుదీప ఎలిమినేట్ అయిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆమె ఎలిమినేషన్ ఇంటి సబ్యులకు కంటతడి పెట్టించింది..ఇక ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఇంటి సభ్యులు రేవంత్, శ్రీహన్ ,అర్జున్ కళ్యాణ్ ,ఫైమా , కీర్తి, ఆదిత్య, శ్రీ సత్య , ఇనాయ సుల్తానా,రాజ్ శేఖర్, మెరీనా, రోహిత్ , అది రెడ్డి మరియు వాసంతి.
అందరూ ఊహించినట్టు గానే ఈ వారం నామినేషన్స్ లో కూడా రేవంత్ అత్యధిక ఓట్లతో మొదటి స్థానం లో కొనసాగుతున్నాడు..అతని తర్వాత శ్రీహాన్ రెండవ స్థానం లో కొనసాగుతుండగా, ఆది రెడ్డి మూడవ స్థానం లోను మరియు అర్జున్ కళ్యాణ్ నాల్గవ స్థానం లోను కొనసాగుతున్నాడు..ఈ టాప్ 4 లో ఆది రెడ్డి మరియు అర్జున్ కళ్యాణ్ నిలవడం విశేషం..ఎందుకంటే బిగ్ బాస్ ప్రారంభం నుండి వీళ్లిద్దరి గ్రాఫ్ చాలా తక్కువగానే ఉండేది..ఇటీవల తమ ఆట తీరుని మెరుగు పర్చుకొని ఈ ఇద్దరు రేస్ లోకి ముందు వరుసలోకి వచ్చారు..అయితే ఈ స్థానంలోనే వీళ్ళు కొనసాగుతారా లేదా అనేది ఈ వారం వీళ్లిద్దరి ఆట తీరుని బట్టి ఉంటుంది.

ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే శ్రీ సత్య మరియు వాసంతి..సోషల్ మీడియా లో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న వీళ్లిద్దరు డేంజర్ జోన్ లో ఉండడం ఆశ్చర్యానికి కలగచేస్తున్న విషయం..అయితే వీళ్ళ ఆట తీరుని బట్టి ఈ వారంలో వీళ్లిద్దరు డేంజర్ జోన్ నుండి సేఫ్ జోన్ లోకి ఎంటర్ అవుతారా లేదా అనేది ఆధారపడి ఉన్నది.