Actress Raksha: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు చాలా సంవత్సరాల పాటు సక్సెస్ ఫుల్ హీరోయిన్లు గా కొనసాగుతూ ఉంటారు. ఇక మరి కొంతమంది మాత్రం వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోలేక తొందరగానే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతారు. ఇక కొంతమంది మాత్రం ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి సినిమాల్లో నటిస్తూ ఉంటే, మరి కొంత మంది మాత్రం పెళ్లిళ్లు చేసుకొని అసలు సినిమాల జోలికి రాకుండా పర్సనల్ లైఫ్ ను చాలా బాగా లీడ్ చేస్తూ ఉంటారు.
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు సినిమాలో ఒక సాంగ్ తో కుర్రకారును ఉర్రుతాలుగించిన ఒక నటి ఆ తర్వాత తొందరగానే సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇక మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అయితే సంపాదించుకుంది. ఆ నటి ఎవరు అంటే రక్షా..అయితే ఈమె అసలు పేరు రాణి.. అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పేరుని రక్షా గా మార్చుకుంది. ఈమె మొదట అజిత్ హీరోగా వచ్చిన ‘ప్రేమలేఖ’ అనే సినిమాలో ‘చిన్నదాన ఓసి చిన్నదాన’ అనే సాంగ్ లో డాన్స్ చేసి మెప్పించింది. ఇక ఆ సాంగ్ ద్వారా వచ్చిన క్రెడిట్ ని వాడుకుంటూ ఆ తర్వాత వరుస సినిమాల్లో చేస్తూ తనదైన రీతిలో హీరోయిన్ గా నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేసింది.
ఇక మొదటగా విక్రమ్ హీరోగా వచ్చిన ‘చిరునవ్వుల వరమిస్తావా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించక పోయేసరికి తను కొన్ని స్పెషల్ సాంగ్స్ లో నటించి మెప్పించింది. ఇక ఆమె కెరియర్ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి చాలా సినిమాల్లో కూడా నటించింది. ఇక ముఖ్యంగా రవిబాబు డైరెక్షన్ లో తనీష్ హీరోగా వచ్చిన ‘నచ్చావులే ‘ అనే సినిమాలో హీరో మదర్ గా నటించి మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా ఏర్పాటు చేసుకుంది.
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందుతూ ముందుకు సాగుతుంది. అయితే ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఈమె మీద చాలా రకాల కామెంట్లైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఆమె ఫోటో చూసిన చాలా మంది అభిమానులు ఈమె అప్పటికి ఇప్పుడు ఒకేలా ఉంది అంటు కామెంట్లు చేస్తున్నారు…