Akhanda 2 break even: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. బాలయ్య మాస్ కి బోయపాటి లాజిజ్ లేని మాస్ టేకింగ్ కి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతూ ఉంటారు. ఇప్పటి వరకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్, అఖండ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. ముఖ్యంగా అఖండ చిత్రం అయితే బాలయ్య కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ చిత్రం తర్వాత ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా నాలుగు హిట్లు కొట్టాడు. తన కెరీర్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ గా ‘అఖండ తాండవం'(Akhanda 2 Movie) చిత్రం చేసాడు. వచ్చే నెల 5వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. కనీస స్థాయి బుకింగ్స్ కూడా నమోదు అవ్వడం లేదు. సినిమా విడుదలకు సరిగ్గా 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 11 రోజుల్లో ఈ చిత్రానికి కనీసం మరో లక్ష డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కూడా వచ్చేలా కనిపించడం లేదు. మరో పక్క సీక్వెల్ అవ్వడం తో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ భారీ గా జరిగింది. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతం లో అయితే నేటి తరం స్టార్ హీరోల సినిమాలతో సమానంగా బిజినెస్ జరిగింది. దాదాపుగా ఈ ప్రాంతంలో 26 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఇది సామాన్యమైన విషయం కాదు. రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి ఇక్కడ 23 కోట్ల రూపాయిల బిజినెస్ మాత్రమే జరిగింది. ఈ చిత్రానికి అంతకు మించి జరగడం గమనార్హం.
అదే విధంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 30 కోట్ల రూపాయలకు జరిగిందని, అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో 13.5 కోట్ల రూపాయలకు బిజినెస్ జరగ్గా, గుంటూరు జిల్లాకు 9.5 కోట్ల రూపాయిలు, తూర్పు గోదావరి జిల్లాలో 8 కోట్ల 25 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాకు 6.5 కోట్ల రూపాయిలు, కృష్ణా జిల్లాలో 7 కోట్ల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 4 కోట్ల 50 లక్ష్ఝల రూపాయలకు జరిగింది. ఇలా ప్రతీ ప్రాంతం లోనూ నేటి తరం స్టార్ హీరోల సినిమాలకు సమానంగా బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 115 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 230 కోట్ల రూపాయిల గ్రాస్ వసూ1ళ్లు రావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రమోషనల్ కంటెంట్ కి అంత గ్రాస్ రావడం అసాధ్యమే.