Chiru Dosa: మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో నిమగ్నమైపోయాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తూ.. వినూత్నంగా ఓ ఫుడ్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు ఈ ఛాలెంజ్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా వివరాలు చెబుతూనే.. తనకిష్టమై ఫుడ్ గురించి కూడా చరణ్ పల ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలోనే చిరుదోశ గురించి సరదాగా ముచ్చటించారు.

చిరంజీవి ఇంట్లో అప్పుడప్పుడు వంట చేసే సంగతి తెలిసిందే. తనే స్వయంగా అప్పుడప్పుడు వంట చేసి ఇంట్లో అందరికీ తినిపిస్తుంటారు. కాగా, చరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా ఇంట్లో చిరు దోశ చాలా ఫేమస్ ఈ విషయం అందరికీ తెలుసు. అయితే, ఆ దోశలో ఏమేం వేస్తారో నాకైతే అసలు తెలేదు.. మా అమ్మ కూడా ఎప్పుడూ చప్పలేదు. కానీ, ఆ దోశ మాత్రం చాలా టేస్టీగా ఉంటది. అని చెప్పుకొచ్చారు.
కాగా, చెర్రీ ఎక్కువగా స్వీట్స్, కారంగా ఉండే పదార్థాలు ఇష్టపడతాడట. ఇంట్లో ఎక్కువగా స్పైసీ ఐటెమ్స్ తినేది తనేననట. దీంతో పాటు మాంసాహారం కంటే ఎక్కువగా శాకాహారానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు చెర్రి. ఇక హైదరాబాద్ బిర్యాని అంటే ఫుల్‌గా లాగించేస్తానని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో చెర్రితో పాటు తారక్ కూడా హీరోగా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది.