Brahmaji
Brahmaji: బ్రహ్మాజీ గురించి పరిచయం అవసరం లేదు. ఇక టాలీవుడ్ ప్రేక్షకులకు ఈయన సుపరిచితుడే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటుడిగా తనకంటూమంచి గుర్తింపు సంపాదించారు బ్రహ్మాజీ. నటనపై ఆసక్తి ఉండటంతో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. చిన్న చిన్న పాత్రలు పోషించి ఆ తర్వాత హీరోగా ఎదిగారు. కానీ మళ్లీ సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలు, కమెడియన్ గా నటిస్తూ అడియన్స్ కు మరింత దగ్గరయ్యారు ఈ నటుడు.
సినిమాల్లో తనదైన నటనతో అలరించే బ్రహ్మాజీ నిజ జీవితంలోనూ అంతే పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉంటారు. సినీ ఈవెంట్స్, రియాల్టీ షోలలో కామెడీ టైమింగ్‌తో నవ్విస్తుంటారు ఈ నటుడు. ఇక ఇప్పుడు సినిమాలతోపాటు.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు సెలబ్రెటీలకు సంబంధించిన ట్వీట్స్ మీద కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతుంటారు. రీసెంట్ గా బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోని పాపులర్ రెస్టారెంట్స్, కేఫ్ లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. చాలా ఫేమస్ అయిన హోటల్స్, రెస్టారెంట్లలో కుల్లిపోయిన, కల్తీ అయినాఆహారాన్ని గుర్తించారు. అంతేకాదు ఎక్స్పైర్ అయినా పదార్థాలతో ఫుడ్ ప్రీపేర్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు . దీనికి నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ఆయన రిప్లే ఇస్తూ “సర్.. మరి ఎక్కడ తినమంటారు. ? ఇంట్లోనా” అని రిప్లే ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో అవకాశాల వెతుకుతున్న సమయంలో బ్రహ్మాజీకి డైరెక్టర్ కృష్ణవంశీతో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరు కలిసి ఆఫర్స్ కోసం వెతికారు. కృష్ణవంశీ తెరకెక్కించిన నిన్నే పెళ్లాడుతా సినిమాలో బ్రహ్మాజీ కీలకపాత్ర పోషించి తన నటనతో మెప్పించారు. ఈ మూవీ హిట్ అయిన తర్వాత బ్రహ్మాజీని హీరోగా పెట్టి సింధూరం మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో మాస్ మాహారాజా రవితేజ కూడా మరో హీరోగా మెప్పించారు. ఈ మూవీ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పటికీ కూడా మంచి మంచి పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో తనదైన మార్కును సంపాదించారు.
Sirr.. Mari ekkada thinamantaru..?
Intilonaaa ..? https://t.co/Vs8r0kd83A— Brahmaji (@actorbrahmaji) May 23, 2024
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Brahmaji tweet is now going viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com