Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చే విధంగా ఉంది. హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరికి గట్టిగా ఇచ్చిపడేస్తున్నాడు. కాగా బాల్స్ టాస్క్ లో శోభా బిహేవియర్ చూసి కోపం లో ” గొంతు మీద కాలేసి తొక్కేవాడిని ” అంటూ శివాజీ అన్న మాట గురించి నాగార్జున నిలదీశాడు. ముందుగా శివాజీని కన్ఫెషన్ రూంలోకి పిలిచారు. నీ లాంటి వాళ్లు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా అన్నావ్ ఏంటది శివాజీ అని అడిగారు.
నేనేదో వాంటెడ్ గా మాట్లాడిన మాట కాదు సార్ అది నాకు వేసిన బాధ అంటూ శివాజీ చెప్పాడు. దీంతో ఆ బాధతో మీ ఇంట్లో ఆడపిల్లని అయితే పీకుతావా అని నాగార్జున అన్నారు. అవును అండి కొడతానండి అంటూ శివాజీ చెప్పాడు. ఒక సారి వీడియోలు అన్ని చూసి మాట్లాడండి బాబు గారు అంటూ శివాజీ అన్నాడు. వీడియో చూసినా .. నేను ఇంత గట్టిగా రియాక్ట్ అవుతున్ననంటే చూసిన ఆడపిల్లలందరూ నీ మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అంటూ నాగ్ ఫైర్ అయ్యారు.
ఇక ఆడియన్స్ లో నుండి ఒక అమ్మాయిని అడిగారు. ఆడపిల్లను అలా అనడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అని ఆమె చెప్పింది. దీంతో శివాజీ ‘ అంటే మగ పిల్లలని ఏమైనా అనొచ్చా .. వాళ్ళని ఎలాగైనా చేసేయొచ్చా అంటూ శివాజీ వాదించాడు. శివాజీ .. టాపిక్ డైవర్ట్ చేయొద్దు అంటూ నాగార్జున అన్నారు. కోపంలో అంటాము బాబు గారు .. నిజంగానే చేస్తారా అండి అవన్నీ అని శివాజీ అన్నాడు.
ఫ్లో లో అయినా ఒక మూడు, నాలుగు కోట్ల మంది చూసేటప్పుడు అనవలసిన మాటలు కాదు అది. నువ్వు అన్న మాట తప్పు చాలా పెద్ద తప్పు అంటూ ఏకిపారేశారు నాగార్జున. ఇక ప్రశాంత్ కి కూడా బానే అక్షింతలు పడ్డాయి. అయితే శివాజీ కూడా నాగార్జునతో గట్టిగా వాదించాడు. తనను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు.
Today’s promo 2
saradaga annanu sir!#BiggBossTelugu7 pic.twitter.com/2tLs4qp2FA— BiggBossTelugu7 (@TeluguBigg) December 9, 2023