Balayya rejected Rajinikanth: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) కి సరికొత్త ఊపుని అందించిన చిత్రం ‘జైలర్’. నేటి తరం ఆడియన్స్ కి ఆయన స్టార్ పవర్ ఎలాంటిదో అర్థం అయ్యేలా చేసింది. తాను సూపర్ హిట్ కొడితే నేటి తరం సూపర్ స్టార్స్ గా పిలవబడే అనేక మంది హీరోలు కూడా ఆ కలెక్షన్స్ ని అందుకోలేరు అని నిరూపించిన సినిమా ఇది. కేవలం థియేటర్స్ లోనే కాదు, ఓటీటీ లో కూడా ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. నెలల తరబడి అమెజాన్ ప్రైమ్ లో ట్రెండ్ అవుతూనే ఉండేది ఈ చిత్రం. అంత పెద్ద బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సీక్వెల్ ని ప్రకటించిన రోజే మార్కెట్ లో విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది.
ఎప్పుడైతే ‘జైలర్ 2′(Jailer 2 Movie) షూటింగ్ మొదలు అయ్యింది అంటూ స్పెషల్ వీడియో ప్రకటన చేశారో, అప్పటి నుండే ఈ చిత్రానికి బిజినెస్ మొదలైంది. తెలుగు, తమిళం తో పాటు హిందీ భాషలో కూడా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో ఒక 15 నిమిషాల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ కి డైరెక్టర్ నెల్సన్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ని సంప్రదించారని, అందుకు బాలకృష్ణ కూడా ఒప్పుకొని డేట్స్ ఇచ్చాడని, ఈ స్పెషల్ క్యామియో రోల్ కోసం ఆయన పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నాడని, ఇలా టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో ఎన్నో వందల కథనాలు వచ్చాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు కేవలం రూమర్స్ మాత్రమే అని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో వార్త. అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది.
ఆయనకు బదులుగా మలయాళం స్టార్ హీరోస్ లో ఒకరైన ఫహద్ ఫాజిల్(పుష్ప ఫేమ్) నటిస్తున్నట్టు సమాచారం. గతంలో ఫహద్ రజినీకాంత్ తో కలిసి ‘వెట్టియాన్’ అనే చిత్రం లో నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, ఫహద్ క్యారక్టర్ కి మంచి పేరొచ్చింది. అయితే బాలయ్య ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు?, ఆయన క్యారక్టర్ కి పెద్దగా ప్రాధాన్యత లేదా?, ఆయన చెప్పిన మార్పులు చేర్పులను డైరెక్టర్ నెల్సన్ చేయడానికి ఒప్పుకోలేదా?, అందుకే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడా?, అసలు ఏమి జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియదు. ఇకపోతే జైలర్ లో నటించిన శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి వారు ఈ చిత్రం లో కూడా కనిపిస్తారట. బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి ఇందులో మెయిన్ విలన్ క్యారక్టర్ చేస్తున్నట్టు సమాచారం. నేషనల్ అవార్డు విన్నర్ విద్యా బాలన్ ఇందులో మిథున్ కి కూతురు క్యారక్టర్ చేస్తోంది.