Homeఎంటర్టైన్మెంట్Balakrishna- Mokshagna: ఒకే సినిమాలో బాలయ్య - మోక్ష‌జ్ఞ‌... ఇదొక మైథలాజికల్ డ్రామా...

Balakrishna- Mokshagna: ఒకే సినిమాలో బాలయ్య – మోక్ష‌జ్ఞ‌… ఇదొక మైథలాజికల్ డ్రామా !

Balakrishna- Mokshagna: టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్య‌యిన్‌ ‘శ్యామ్‌ సింగరాయ్’ తో నేషనల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, తాజాగా రాహుల్ సంకృత్య‌యిన్‌, బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌ కూడా కనిపించబోతున్నాడట. మోక్ష‌జ్ఞ‌ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందని.. ఇంటర్వెల్ కి ఫుల్ ఎమోషనల్ గా సినిమా టర్న్ అయ్యేలా మోక్ష‌జ్ఞ‌ పాత్ర ఉంటుందని.. ఇది ఒక యూనిక్ పాత్ర అని, ఇదొక ఫిక్షనల్ మైథలాజికల్ ఫిల్మ్ అని తెలుస్తోంది.

Balakrishna- Mokshagna
Balakrishna- Mokshagna

దీని పై త్వర‌లోనే అధికార‌కంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. మరి నిజంగానే నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌, బాలయ్య సినిమాలో నటిస్తే.. నందమూరి అభిమానులకు ఫుల్ పండగే. అసలుకే.. నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌ ఎంట్రీ పై ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఇన్నాళ్లకు ఆ ఎంట్రీ ఉండబోతుంది. పైగా నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌ నటిస్తే వచ్చే ఆ క్రేజ్, బాలయ్య సినిమాకి బాగా కలిసొస్తుంది.

Also Read: Ananya Panday: ఆ హీరోయిన్ కి కోటి ఇచ్చి బుక్ అయిన నిర్మాత !

రాహుల్ సంకృత్య‌యిన్‌ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ.. ‘నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలో మైథలాజికల్ డ్రామా అద్భుతంగా ఉండబోతుంది, అలాగే కామెడీ డోస్ ఉంటుంది, అన్నిటికీ మించి అన్ని అనుకుంటే జరిగితే.. అదొక సీరియస్ యాక్షన్ డ్రామా అవుతుంది అని చెప్పుకొచ్చాడు.

రాహుల్ సంకృత్య‌యిన్‌ మాటలను బట్టి.. బాలయ్య సినిమాని భారీగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు. పైగా బాలయ్యతో పాటు నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌ కూడా సినిమాలో ఉంటాడు. కాబట్టి.. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. ఆ అంచనాలకు తగ్గకుండానే సినిమాని ప్లాన్ చేస్తున్నాడట రాహుల్ సంకృత్య‌యిన్‌. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట.

Balakrishna- Mokshagna
Balakrishna- Mokshagna

మరి రాహుల్ సంకృత్య‌యిన్‌ – బాలయ్య బాబు – మోక్ష‌జ్ఞ‌ లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే… ఆ కిక్కే వేరు. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, వైవిధ్యమైన వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పై నెటిజన్లు కూడా ఆసక్తి ఉంది. ఎలాగూ ‘అఖండ’తో బాక్సాఫీస్ దగ్గర ‘నటసింహం’ కలెక్షన్ల సునామీ చూపించాడు. ఆ రకంగానూ బాలయ్యకి క్రేజ్ రెట్టింపు అయ్యింది. కాబట్టి.. వీరి కలయికలో రానున్న సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో చేస్తారట.

Also Read: Shivaji Raja- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను అంత ఆవేశంగా ఎప్పుడూ చూడలేదన్న శివాజీరాజా.. దానికి ఆమె కారణం!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version