Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ కి అవకాశాలు తగ్గిపోయాయా..?

ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్ లాంటి ఒక డిజాస్టర్ సినిమాలో నటించి తన క్రేజ్ మొత్తాన్ని తగ్గించుకుందనే చెప్పాలి. ఇక ఒక వంతుకు నాని హీరోగా వచ్చిన 'హాయ్ నాన్న' సినిమాలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఈ సినిమా ఓకే అనిపించింది.

Written By: Gopi, Updated On : May 22, 2024 8:57 am

Mrunal Thakur

Follow us on

Mrunal Thakur: సీతా రామం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ ఆ సినిమాతో ప్రేక్షకులందరిని మైమరపింపజేసింది. ఇక ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది. అలాగే వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ సీతారామం సినిమాలో ఎంత మ్యాజిక్ అయితే చేసిందో ఆ తర్వాత వచ్చిన సినిమాలతో తను ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇక ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్ లాంటి ఒక డిజాస్టర్ సినిమాలో నటించి తన క్రేజ్ మొత్తాన్ని తగ్గించుకుందనే చెప్పాలి. ఇక ఒక వంతుకు నాని హీరోగా వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమాలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఈ సినిమా ఓకే అనిపించింది. అయితే ఈమె కి అవకాశం ఇచ్చే స్టార్ హీరో కరువయ్యారనే చెప్పాలి. ఇక దాంతో ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంది. అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈమె నార్మల్ హీరోయిన్ గానే మిగిలిపోవడం అందులో స్టార్ హీరోలు ఎవరు కూడా అసలు పట్టించుకోకపోవడంతో ఆమె చాలావరకు అవకాశాలను కోల్పోయిందనే చెప్పాలి…

ఇక మొత్తానికైతే ఒకప్పుడు కాజల్,సమంత, అనుష్క లాంటి హీరోయిన్లు ఎలాగైతే ఇండస్ట్రీని కొద్ది సంవత్సరాల పాటు ఏలారో అలాంటి సిచువేషన్ లోకి తను వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలు తలకిందులైపోయాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలకు కమిట్ అవుతున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో మాత్రం మరే స్టార్ హీరో తో సినిమా చేయడానికి ఇప్పటివరకైతే కమిట్ అవ్వలేదు. ఇక మొత్తానికైతే ఇప్పుడు వచ్చే ఒకటి రెండు చిన్న సినిమాలతో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది.

ఇక ఈమె ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు కొనసాగలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి తను ఏమాత్రం మ్యాజిక్ చేస్తుంది అనేది… ఇక ఇప్పుడైతే ఆమె కొన్ని చిన్న సినిమాల తో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశం అయితే ఉంది అలా కనుక చేస్తే అవకాశాలు వస్తాయనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…