Ambati Arjun: మెగా హీరో బ్లాక్ బస్టర్ మూవీ, ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ చేయాల్సిందా… ఇంట్రెస్టింగ్ స్టోరీ!

అర్జున్ సీరియల్స్ మాత్రమే కాకుండా పలు సినిమాలు, వెబ్ సిరీస్లు చేసాడు. కానీ అవి చిన్న సినిమాలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. కాగా గత ఏడాది విడుదలైన విరూపాక్ష భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించాడు.

Written By: S Reddy, Updated On : March 29, 2024 10:53 am

Ambati Arjun

Follow us on

Ambati Arjun: సీరియల్ నటుడు అంబటి అర్జున్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అగ్ని సాక్షి, దేవత వంటి సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ ఎంట్రీ గా వచ్చి సత్తా చాటాడు. ప్రతి టాస్క్ లో దున్ని పారేసాడు. బిగ్ బాస్ సీజన్ 7 బాహుబలిగా పేరు తెచ్చుకున్నాడు. ఫైనలిస్ట్ గా నిలిచి ఆరో స్థానం దక్కించుకున్నాడు అర్జున్. మొదట్లోనే ఎంట్రీ ఇచ్చి ఉంటే కథ వేరేగా ఉండేది.

అర్జున్ సీరియల్స్ మాత్రమే కాకుండా పలు సినిమాలు, వెబ్ సిరీస్లు చేసాడు. కానీ అవి చిన్న సినిమాలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. కాగా గత ఏడాది విడుదలైన విరూపాక్ష భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించాడు. వాస్తవానికి ఆ సినిమా అర్జున్ చేయాల్సిందట. ఆ మూవీ డైరెక్టర్ ముందుగా అర్జున్ ని హీరోగా అనుకున్నాడట. ఈ విషయం స్వయంగా అంబటి అర్జున్ వెల్లడించాడు.

రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కి హాజరైన అర్జున్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా విరూపాక్ష సినిమాలో మొదట తననే హీరోగా అనుకున్నారని అన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అని అర్జున్ తెలిపాడు. అయినా కూడా సంతోషంగానే ఉన్నానని .. ఎందుకంటే తనతో ఆ సినిమా చేసి ఉంటే అంత పెద్ద సక్సెస్ కాకపోయి ఉండేది అని అర్జున్ వెల్లడించాడు.

ఇక విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ అతని స్నేహితుడని, ఎప్పుడూ అతను సినిమా ప్రపంచంలో ఉంటాడని అర్జున్ అన్నాడు. ఇద్దరూ కలిసి లూప్ అనే వెబ్ సిరీస్ చేశాం. ఆ తర్వాత ఓ సినిమా చేయాలి అనుకున్నాం. కథ రెడీ చేసుకున్నాం. శాసనం అని టైటిల్ పెట్టాం. కానీ నిర్మాతలు దొరకలేదు. ఆ తర్వాత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఆ స్టోరీకి కొన్ని మార్పులు చేసి రూపొందించారు అదే విరూపాక్ష. ముందుగా నన్ను హీరోగా అనుకున్నారు కానీ కుదర్లేదు అంటూ అర్జున్ అంబటి చెప్పుకొచ్చాడు.