https://oktelugu.com/

Agent: కంగారు పెడుతున్న ‘ఏజెంట్’ ప్రివ్యూ షో టాక్..అఖిల్ మరో రీ లాంచ్ తప్పదా..!

Agent: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు సుమారుగా మూడేళ్ళ నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్లకి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం. అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చి 8 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు, […]

Written By:
  • Vicky
  • , Updated On : April 25, 2023 / 06:03 PM IST
    Follow us on

    Agent: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు సుమారుగా మూడేళ్ళ నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్లకి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం. అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చి 8 ఏళ్ళు అవుతుంది.

    ఇప్పటి వరకు కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు, ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టి ఏకంగా 100 కోట్ల రూపాయిల షేర్ క్లబ్ లోకి అడుగుపెడుతాడని బలమైన నమ్మకం తో ఉండేవారు అక్కనినేని ఫ్యాన్స్. టీజర్ మరియు ట్రైలర్ కూడా బాగుండడం తో వాళ్ళు ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టేసుకున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని ఇటీవలే ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ప్రముఖులు మరియు బయ్యర్స్ కి వేసి చూపించారు.

    వాళ్ళ నుండి వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఈ సినిమా బీలో యావరేజ్ గా ఉందట. అఖిల్ పాపం చాలా కష్టపడ్డాడని, కానీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ మీద ఇంకా కాస్త బలంగా వర్క్ చేసి ఉంటే అఖిల్ కెరీర్ లో ఈ చిత్రం మైలు రాయిగా నిలిచేదని, బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యిందని అంటున్నారు. మరి ఇదే రేంజ్ టాక్ విడుదల తర్వాత కూడా వస్తుందా,లేదా పాజిటివ్ టాక్ వస్తుందా అనేది తెలియాలంటే ఈ నెల 28 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.

    అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు రాబొయ్యే రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ కి చేరుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అక్కినేని కుటుంబం లో మరో సుశాంత్ లాగా అఖిల్ మిగిలిపొయ్యే ఛాన్స్ ఉంది.అలాంటి పరిస్థితి రాకూడదని,ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటాను.