Actor Mohan
Actor Mohan: సోషల్ మీడియాలో రూమర్స్ చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంటాయి. ఇక సెలబ్రెటీల విషయంలో అయితే మరింత ఫాస్ట్ గా వైరల్ గా మారతాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న తారలు తమపై వచ్చే రూమర్స్ పై స్పందిస్తే.. మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం ఎప్పుడో జరిగిన అసత్య ప్రచారాలపై ఇప్పుడు స్పందిస్తారు. ఓ సీనియర్ హీరో ఇప్పుడు ఇలాగే స్పందించారు. అతను ఎవరు కోదాు హీరో మోహన్. ఈయనకు ఒకప్పుడు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది.
80’sలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఎన్నో చిత్రాలు వరుసగా సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కానీ హీరోగా మంచి ఫాంలో ఉన్నప్పుడే ఆయన మీద చాలా రూమర్స్ వచ్చాయి. దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు.
“90’s లో సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు తన మీద కొన్ని రూమర్స్ వచ్చాయని.. అవి తన కుటుంబాన్ని బాధపెట్టాయని తెలిపారు. ఈ హీరోకు ఎయిడ్స్ ఉందనే ప్రచారం జరిగిందట. ఇది విన్న తర్వాత తన ఫ్యామిలీ, అభిమానులు ఆందోళన చెందించిందట. అయితే ఆ సమయంలో కుటుంబం అండగా నిలిచిందట. అయితే ఈయనకు ఎయిడ్స్ లేదని క్లారిటీ ఇవ్వమని ఓ జర్నలిస్టు సలహా ఇచ్చాడట. కానీ అందుకు తను ఒప్పుకోలేదట. ఆ రూమర్ ఈ రూమర్ సృష్టించింది మీడియానే కాబట్టి దాన్ని వారే క్లారిటీ ఇవ్వాలి అనుకున్నారట ఈ హీరో.
ఎలాంటి సంబంధం లేకుండా తనను బలి చేశారని.. అందుకే ఈ విషయాల మీద తను క్లారిటీ ఇవ్వలేదని అనుకున్నారట. 1980లో మోహన్ హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ హీరో మొదట్లో తమిళంలో అనేక చిత్రాల్లో నటించాడు. మౌన రాగం, ఇతియకోయిల్, ట్రిప్‌సాగల్ కనతిల్లై, 100వ రోజు, ఉదయ గీతం, మెల్ల అవుతు దూర్ వంటి సినిమాలు సూపర్ హిట్ ను అందుకొని ఫేమస్ అయ్యారు. తెలుగులో తూర్పు వెళ్లే రైలు, శ్రవంతి, అనంత రాగాలు, ఆలాపన, చూపులు కలిసిన శుభవేళ, అబ్బాయితో అమ్మాయి వంటి సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించారు. మొత్తం మీద ఇన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న మోహన్.. ఇప్పుడు హర అనే తమిళ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
View Author's Full InfoWeb Title: Actor mohan star hero aids the actor gave clarity what actually happened