Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ట్విట్టర్ రివ్యూ: ఫలితం తేల్చేసిన ఆడియన్స్... అల్లరి...

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ట్విట్టర్ రివ్యూ: ఫలితం తేల్చేసిన ఆడియన్స్… అల్లరి నరేష్ కి హిట్ పడిందా?

Aa Okkati Adakku: హీరో రాజేంద్ర ప్రసాద్ కామెడీ క్లాసిక్స్ లో ఒకటిగా ఉంది ఆ ఒక్కటీ అడక్కు. ఈ చిత్రానికి అల్లరి నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకుడు కావడం విశేషం. తండ్రి తెరకెక్కించిన మూవీ టైటిల్ అల్లరి నరేష్ అడాప్ట్ చేసుకున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు మే 3న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఆ ఒక్కటీ అడక్కు మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. మరి హిట్ కోసం అల్లాడుతున్న అల్లరి నరేష్ ఈ సారైనా సక్సెస్ అయ్యాడా? ఆడియన్స్ రెస్పాన్స్ ఏమిటీ?

ఆ ఒకటీ అడక్కు కథ విషయానికి వస్తే… ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి కాక ఇబ్బంది పడుతూ ఉంటాడు అల్లరి నరేష్. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చేయని ప్రయత్నం ఉండదు. అనేక మాట్రిమోని సంస్థలను సంప్రదిస్తాడు. మరి ఈ పెళ్లి కానీ ప్రసాద్ కోరిక తీరిందా? పెళ్లిని వ్యాపారంగా మార్చి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి.. అనేది మిగతా కథ.

అబ్బాయికి పెళ్లి కావడం అతిపెద్ద సమస్యగా మారింది. అబ్బాయిల నిష్పత్తి కంటే అమ్మాయిల నిష్పత్తి చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఈ సమస్య తలెత్తుతుంది. గత పదేళ్లులో లక్షల మంది అబ్బాయిలు పెళ్లి కాకుండా మిగిలిపోయారు. ఈ సోషల్ బర్నింగ్ టాపిక్ ని ఎంచుకున్న దర్శకుడు కామెడీగా చెప్పాలి అనుకున్నాడు. అదే సమయంలో సందేశం జోడించాడు. ఆడియన్స్ అభిప్రాయంలో ఆ ఒక్కటి అడక్కు ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్లుగా ఉంటుంది.

పెళ్లి కోసం హీరో పడే పాట్లను కామెడీగా దర్శకుడు చిత్రీకరించాడు. అయితే కామెడీ పూర్తి స్థాయిలో పండలేదు అంటున్నారు. సెకండ్ హాఫ్ సైతం కామెడీగా స్టార్ట్ చేసి కథను సీరియస్ సబ్జెక్టు వైపు మలుపు తిప్పాడట. మంచి పాయింట్ ఎంచుకున్న దర్శకుడు దాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఎంటర్టైనింగ్ ప్రెజెంట్ చేయడంలో తడబడ్డాడని అంటున్నారు. అల్లరి నరేష్ తన పాత్రలో అద్భుతంగా నటించాడట. ఫరియా అబ్దుల్లా క్యూట్ యాక్టింగ్ ఆకట్టుకుంటుందని అంటున్నారు.

సంగీతం మైనస్ అంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఆ ఒక్కటీ అడక్కు కామెడీ చిత్రాలు ఇష్టపడేవారు, అల్లరి నరేష్ ఫ్యాన్స్ ఆస్వాదిస్తారు. ప్రజెంట్ బర్నింగ్ పాయింట్ ఎంచుకున్న దర్శకుడు మల్లి అంకం ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యాడు. అయితే ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చని ఆడియన్స్ అభిప్రాయం.

RELATED ARTICLES

Most Popular