Homeఎంటర్టైన్మెంట్Krishna Fans: ‘హీరో’లో కృష్ణ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!

Krishna Fans: ‘హీరో’లో కృష్ణ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!

Hero Krishna fans: సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సపోర్టుతో గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి అందరికీ తెల్సిందే. ‘హీరో’ మూవీతో జనవరి 15న గల్లా అశోక్ తెలుగు ప్రేక్షకులను పలుకరించ బోతున్నాడు. ఈ మూవీలో అశోక్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Krishna Fans
Krishna Fans

సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘హీరో’ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో గల్లా అశోక్ ను కౌబాయ్ గా దర్శకుడు చూపించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు పేర్లు బాగానే విన్పించాయి. ఇక ఈ మూవీలోని తొలి పది నిమిషాలు కృష్ణ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే పోయే ట్రీట్ ఉండేలా దర్శకుడు ప్లాన్ చేశారని తెలుస్తోంది.

Also Read:  ‘వనమా’ దొరికాడిలా.. రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

కౌబాయ్ సినిమాలకు సూపర్ స్టార్ కృష్ణ పెట్టింది పేరు. ‘మోసగాళ్లకు మోసగాళ్లు’లో కృష్ణ కౌబాయ్ గా నటించి వారెవ్వా అనిపించుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్స్ కౌబాయ్ గెటప్పుల్లో కన్పించి అభిమానులను ఆకట్టుకున్నారు. గల్లా అశోక్ తొలి మూవీలోనే దర్శకుడు కౌబాయ్ గా పరిచయం చేయనుండటం ఆసక్తిని రేపుతోంది.

ఈ మూవీలోనే సూపర్ స్టార్లు కృష్ణ, మహేష్ బాబులు సైతం ఓ సన్నివేశంలో కౌబాయ్ లుగా కన్పించనున్నారట. ఒకేసారి కృష్ణ, మహేష్ బాబు, అశోక్ లు కౌబాయ్ గెటప్పులో ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇస్తారని తెలుస్తోంది. ఈ సీన్ నిజంగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా ఉండనుందట. అయితే ఈ సీన్ ను గ్రాఫిక్స్ లో యాడ్ చేసేలా నిజంగా కృష్ణ గారు ఈ మూవీలో యాక్ట్ చేశారా? అనేది మాత్రం మూవీలో చూడాల్సిందే..!

Also Read: అకీరాకి కరోనా పాజిటివ్.. పవన్ సాయం నిరాకరించిన రేణూ దేశాయ్ ! కారణమిదే

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

2 COMMENTS

  1. […] Anupama Parameswaran: యంగ్ మలయాళ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’కి కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆ మధ్య తెలుగులో అనుపమకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. కానీ, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు. రాకపోయినా.. మీడియం రేంజ్ హీరోలకు బెటర్ ఆప్షన్ గా అనుపమ ఇప్పటివరకు నిలుస్తూ వచ్చింది. దాంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఎలాగోలా కెరీర్ ను బాగానే మెయింటైన్ చేస్తూ వస్తోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular