Akhanda 2 : ఈమధ్య కాలం లో VFX కంటెంట్ తో ముడిపడి ఉన్న సినిమాలు బాగా ఆలస్యం అవుతున్నాయి. గతం లో స్టార్ హీరోలు మామూలు కమర్షియల్ సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ లో నిలబడడానికి భారీ బడ్జెట్ VFX సినిమాలకు అలవాటు పడ్డారు. ఫలితంగా సమయానికి VFX కంటెంట్ డెలివరీ అవ్వక, సంవత్సరం లో రావాల్సిన సినిమాలు, రెండేళ్లు,మూడేళ్ళ సమయం తీసుకుంటున్నాయి. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ని తీసుకుందాం. రీ ఎంట్రీ తర్వాత ఏడాదికి కచ్చితంగా ఒక సినిమా ఉండేలా చూసుకుంటూ వచ్చాడు. 2023 వ సంవత్సరం లో ఆయన నుండి రెండు సినిమాలు విడుదల అయ్యాయి. కానీ అదే ఏడాది లో మొదలైన విశ్వంభర(Viswambhara Movie) చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. కారణం గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి. పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సంగతి సరే సరి.
అసలే ఈ సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాక VFX కారణంగా జూన్ 12 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని వాయిదా వేశారు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు మొత్తం వర్క్ పూర్తి అవ్వడం తో మరో పడి రోజుల్లో, అనగా జులై 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం క్లైమాక్స్ తర్వాత వచ్చే క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశం కోసం ఇన్ని రోజుల సమయం తీసుకున్నారట. ‘హరి హర వీరమల్లు’ కి ఎదురైన సమస్యలే ఇప్పుడు బాలకృష్ణ(Nandamuri Balakrishna ) ‘అఖండ 2′(Akhanda 2 Movie) కి ఎదురు అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు రెండవ వారం లో పూర్తి అవుతుంది. కానీ VFX వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉందట. నిర్మాతల ప్లాన్ అయితే ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 న విడుదల చెయ్యాలని.
కానీ ఆ సమయానికి ఈ చిత్రం రెడీ అయ్యే అవకాశం లేకపోవడం తో మేకర్స్ డిసెంబర్ నెలలో కానీ,లేదా సంక్రాంతికి కానీ ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. ఇది ఎంత వరకు నిజం అవుతుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లోని గ్రాఫిక్స్ మాత్రం చాలా చీప్ గా ఉన్నాయి. ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. జులై 27 న విడుదలైన ‘కన్నప్ప’ చిత్రానికి ఇదే సమస్య. మొదట్లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ అప్పటికి VFX వర్క్ పూర్తి అవ్వకపోవడం తో జూన్ నెలకు వాయిదా వేసి విడుదల చేశారు. ఒకప్పుడు VFX తో కూడుకున్న సినిమాలు చాలా తక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం అన్ని అవి మాత్రమే ఉన్నాయి. అందుకే VFX బాగా ఆలస్యం అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.