Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ షర్టు విప్పుతే తప్పులేదు, మేము పొట్టి బట్టలేసుకుంటే తప్పేంటి అని వాదించే వితండ వర్గం సోషల్ మీడియాలో ఒకటుంది. ఎప్పుడూ ఇలాంటి పనికిరాని తర్కంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే, యాంకర్ అనసూయ ఉమన్స్ డేని ఫూల్స్ డే అని ట్వీట్ పెట్టిందట. అందరూ సుబ్బరంగా పండుగ జరుపుకుంటుంటే ఈ నెగిటివ్ ట్వీట్లు ఎందుకమ్మా అని అనసూయని తెగ ట్రోలింగ్ చేస్తున్నారట నెటిజన్లు.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజుకు సర్జరీ జరిగింది. ఇటీవల ఆయన కాలుజారి పడ్డారు. దాంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఆయనకు సర్జరీ చేశారు. అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయన తాజాగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఈనెల 11న విడుదల కానుంది.
Also Read: ట్రోలర్స్ కి షాకిచ్చేలా ట్వీట్ చేసిన అనసూయ

ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళితో సినిమా ఎప్పుడుంటుందని ఓ జర్నలిస్టు డార్లింగ్‌ను అడిగాడు. ‘రాజమౌళి నాకు మంచి మిత్రుడు. సినిమా చేయమని ఆయన్ని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. ఆయనతో సినిమా అంటే నేను రెడీగా ఉంటా.

నిజానికి మా ఇద్దరికి ఓ ప్లాన్ ఉంది. అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ సినిమా తప్పకుండా ఉంటుంది అని ప్రభాస్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, 2025లో వీరిద్దరి సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: ఆ హీరోయిన్ని కొట్టి రూమ్ లో బంధించేవాడట