Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. చనిపోయిన తన కుమారుడు గుర్తొచ్చి ప్రముఖ నటుడు బాబు మోహన్ భావోద్వేగానికి గురయ్యారు. తనయుడి మరణాన్ని జీర్ణించుకోలేక అస్థిపంజరంలా మారానని, ఒకానొక సమయంలో చనిపోవాలనుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంబంధిత ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. బాబు మోహన్‌తోపాటు సీనియర్ నటీమణులు అన్నపూర్ణ, శ్రీలక్ష్మి తదితరులు ఈ షోకి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. సీనియర్ నటుడు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నరేష్ మాజీ భార్యగా పేర్కొంటున్న రమ్య రఘుపతిపై పోలీసు కేసు నమోదైంది. నరేష్ పేరుతో కోట్ల డబ్బు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపిస్తూ.. ఐదు గురు మహిళలు హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో రమ్య రఘుపతిపై ఛీటింగ్ కేసు నమోదైంది.
Also Read: భీమ్లానాయక్ మూవీ మేనియా: విద్యార్థుల కోసం ఆంధ్రా యూనివర్సిటీ సెలవిచ్చిందా? నిజమెంత?

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. అజిత్ హీరోగా వినోద్ దర్శకత్వంలో ‘వలిమై’ సినిమా రూపొందింది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాను, తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. హుమా ఖురేషి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఈ సినిమా టీం వరుస ఇంటర్వ్యూలను ఇవ్వనుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితమే వదిలారు. ఇక హైదరాబాద్ లో కూడా ఈ సినిమా టీం వరుస ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు.
Also Read: అక్కడమ్మాయి.. ఇక్కడ అబ్బాయి నుంచి భీమ్లానాయక్ వరకూ.. పవన్ ‘పవర్’ ఎంత?