Rama Rao On Duty Trailer Talk: మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోరుమీద ఉన్నాడు. కాగా రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ రవితేజ అభిమానులకు ఫుల్ కిక్ ను ఇస్తోంది. ట్రైలర్ లోని భారీ విజువల్స్, రవితేజ, దివ్యాన్ష కౌశిక్ – రజీషా విజయన్ మధ్య సాగే లవ్ షాట్స్.. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కి సంబంధించిన మెయిన్ షాట్స్ , ముఖ్యంగా రవితేజ ఎలివేషన్ షాట్స్ అలాగే రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయి.

మొత్తానికి ఈ ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను, రవితేజ పాత్రలోని షేడ్స్ ను, ముఖ్యంగా సినిమాలోని కీలకమైన కథా నేపధ్యాన్ని… ఆ నేపథ్యం తాలూకు మెయిన్ సీక్వెన్సెస్ ఎస్టాబ్లిష్ షాట్స్ ను.. శరత్ ఈ ట్రైలర్ లో చాలా బాగా కట్ చేశాడు. ఇక ట్రైలర్ లో రవితేజ చెప్పిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రైలర్ లోని విజువల్స్ ను చూస్తే అర్ధం అవుతుంది.. ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుంది అని.
Also Read: Aamir Khan- Chiranjeevi: చిరంజీవి మాటలకు అమీర్ ఖాన్ కన్నీళ్లు.. చిరు సంచలన నిర్ణయం
మెయిన్ గా రవితేజ పాత్రలోని వేరియేషన్స్ తో పాటు అతని ఆలోచనా విధానాన్ని, అలాగే అతని పరిస్థితులను కూడా చాలా బాగా చూపించారు. నటన పరంగా ఇక రవితేజ అద్భుతంగా నటించాడు. భారీ అంచనాలకు తగ్గట్టు సాగిన ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది.

ఈ సినిమాతో దర్శకుడిగా శరత్ మండవ పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో, దివ్యాన్ష కౌశిక్ – రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు. సీనియర్ హీరో వేణు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయింది. సినిమా చాలా బాగా వచ్చింది అని.. రవితేజ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉందని తెలుస్తోంది. కాగా యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నట్లు వివరించింది టీమ్.
Also Read:India vs England 3rd ODI: ఇంగ్లండ్ తో నేడే ఫైనల్: టీమిండియాలో మార్పులు ఉండవా?
[…] Also Read: Rama Rao On Duty Trailer Talk: ట్రైలర్ టాక్: దుమ్మురేపిన… […]
[…] Also Read: Rama Rao On Duty Trailer Talk: ట్రైలర్ టాక్: దుమ్మురేపిన… […]