Tollywood Top 5 Directors: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీగా వెలుగొందుతుంది. మన నుంచి వచ్చిన సినిమాల కోసం ఇతర ఇండస్ట్రీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటే మన సినిమాల రేంజ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… అలాగే నార్త్ అభిమానులు సైతం తెలుగు సినిమాలను చూడటానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. ఇక బాలీవుడ్ వాళ్ల నుంచి వచ్చే సినిమాలు నాసిరకంగా ఉంటున్నాయి. అక్కడి ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతున్నాయంటు అక్కడి సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సగటు ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా సినిమాలు ఉన్నప్పుడే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయి. ఇక బాలీవుడ్ వాళ్లు అందులో వెనుకబడి పోతున్నారు…
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం నెంబర్ వన్ పొజిషన్లో రాజమౌళి నిలిచాడు..ఇక అతని తర్వాత స్థానంలో సుకుమార్ ఉన్నాడు. మూడో స్థానంలో సందీప్ రెడ్డివంగ, నాలుగో స్థానంలో నాగశ్విన్ ఉన్నాడు. ఇక ఐదో స్థానంలో ప్రస్తుతం అనిల్ రావిపూడి కొనసాగుతుండటం విశేషం…
అనిల్ రావిపూడి కమర్షియల్ సినిమాలు ఎలా ఉండాలి అనేదానికి ఒక కొత్త పంథాను క్రియేట్ చేశాడు. అందుకే అతనితో సినిమా చేయడానికి చాలామంది స్టార్ హీరోలతో పాటు స్టార్ ప్రొడ్యూసర్లు సైతం పోటీపడుతుండటం విశేషం… ఇక ఇప్పటివరకు టాప్ డైరెక్టర్లుగా ఉన్న వీళ్ళు కూడా ఇక మీదట కూడా భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లినట్టయితే టాప్ డైరెక్టర్లుగా కొనసాగుతారు.
అలాగే మాత్రం స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ గొప్ప గుర్తింపును సంపాదించుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఇక నెంబర్ వన్ పొజిషన్ ని సైతం కైవసం చేసుకోవాలంటే మంచి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాల్సిన అవసరమైతే ఉంది… ఇక ప్రేక్షకుల అభిరుచిని బట్టి దర్శకులు సైతం ఎప్పటికప్పుడు వాళ్ళ పంథాను మార్చుకొని ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాలను చేస్తేనే ఎక్కువ కాలం పాటు వాళ్ళకి మనుగడ ఉంటుంది. లేకపోతే మాత్రం డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…