https://oktelugu.com/

Tollywood: తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ ను కలిసిన టాలీవుడ్ సినీ పెద్దలు…

Tollywood: టాలీవుడ్ సినీ పెద్దలు ఈరోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ మేరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లోని పలు సమస్యలతో పాటు దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో థియేటర్లు మూసివేతపై గురించి చర్చించేందుకు మంత్రితో భేటి అయ్యారు. ఈ భేటీలో దిల్ రాజు, ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్, నిర్మాత దానయ్య… పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ భేటీ సుమారు గంటపాటు సాగినట్లుగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 05:41 PM IST
    Follow us on

    Tollywood: టాలీవుడ్ సినీ పెద్దలు ఈరోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ మేరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లోని పలు సమస్యలతో పాటు దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో థియేటర్లు మూసివేతపై గురించి చర్చించేందుకు మంత్రితో భేటి అయ్యారు. ఈ భేటీలో దిల్ రాజు, ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్, నిర్మాత దానయ్య… పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ భేటీ సుమారు గంటపాటు సాగినట్లుగా తెలుస్తోంది.

    ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా రెండేళ్లుగా సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ వస్తుందని ప్రచారం జరుగుతోందని.. ఆ ప్రచారాలను నమ్మకండి. ఆర్ఆర్ఆర్.. పుష్ప సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. సినీ పరిశ్రమలో కొన్ని సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని… టికెట్ ధరలు.. 5వ షో లాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నాం. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు వస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు.

    థియేటర్లు మూసివేయడం లేదు.. 50 శాతం ఆక్యుపేన్సి గురించి వస్తున్న వార్తలు అవాస్తవం. తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పట్లో థియేటర్లు మూసివేసే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతానికి థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రజలు ధైర్యంగా సినిమాలు చూడోచ్చని.. అన్ని సమస్యలను ఎదుర్కొవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ భేటీ గురించి సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.