Site icon OkTelugu

Tollywood New Villains: టాలీవుడ్ కి కొత్త విలన్స్ కావాలి… అదే బాటలో ఉన్న కొంతమంది హీరోలు…

Tollywood New Villains

Tollywood New Villains

Tollywood New Villains: సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించడం అనేది అంత ఆశామాషీ వ్యవహారం కాదు. చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. స్టార్ హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటే కొంతమంది హీరోలు వాళ్ళకంటూ ఒక సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే హీరోలు కొంతమంది విలన్స్ గా మారి తమ సత్తా చాటుతున్నారు. ఇక ఇప్పటికే జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి నటులు విలన్లుగా మారి వాళ్ళ సత్తా చాటుకుంటున్న క్రమంలో ఇప్పుడు రాజశేఖర్, మోహన్ బాబులు సైతం విలన్స్ గా అవతారం ఎత్తారు. ఇక వాళ్లతో పాటుగా కొంతమంది కుర్ర హీరోలు కూడా విలన్లుగా అవతరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ సైతం నాని ని హీరోగా చేసిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ లో విలన్ గా నటించాడు.

మరోసారి తను ఫుల్ టైం విలన్ గా నటించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక నవీన్ చంద్ర సైతం విలన్ గా అవతరించి పలు సక్సెస్ లను కూడా సాధించాడు. ఇక ఇప్పుడు కూడా కొంతమంది ఫేడౌట్ హీరోలు విలన్స్ గా రాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇక వాళ్ళు ఎవరు అనే విషయంలో క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే కొంతమంది స్టార్ హీరోలు సైతం విలన్లుగా అవతరించడానికి సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి… కొత్త యాక్టర్లు విలనిజాన్ని ప్రదర్శిస్తే సినిమాలు కూడా చాలా ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది.

అలా కాదని ఎప్పుడు చూసే రొటీన్ మొహాల్ని చూస్తే ఆ ఫ్రెష్ ఫీల్ రావడం లేదని చాలామంది ఆడియన్స్ కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీలో కొత్త విలనిజాన్ని పండించడానికి కొత్త నటులు రావడం అనేది చాలా వరకు ప్లస్ అవుతుందనే చెప్పాలి…చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకెంత మంది హీరోలు విలన్స్ గా మారబోతున్నారు అనేది…

Exit mobile version