Tollywood Love Couples: హీరోహీరోయిన్ల డేటింగ్.. టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్.. ఎంతమందో తెలుసా?

సిద్ధార్థ- అదితి రావు: ఈ జంట చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి కనిపిస్తే అందరూ లవ్ అంటూ డేటింగ్ అంటూ కామెంట్లు చేశారు. కానీ తర్వాత ఈ వార్తలపై ఖండిస్తూ మేము లవర్స్ కాదన్నారు.

Written By: Suresh, Updated On : September 21, 2023 10:26 am

Tollywood Love Couples

Follow us on

Tollywood Love Couples: సినిమా ఇండస్ట్రీలో ప్రేమ జంటలు ఎక్కువే. అందులోనూ టాలీవుడ్ లో మరింత ఎక్కువ పెరిగిపోతున్నాయి ఈ జంటలు. అయితే వాళ్లు రిలేషన్ లో ఉన్నారా లేదా? అనేది పక్కన పెడితే కాస్త క్లోజ్ గా కనిపించినా, ఎక్కడైనా కలిసి కనిపించినా కూడా రూమర్స్ రావడం అయితే సర్వసాధారణమే. డేటింగా? లవ్వా అంటూ ఎన్నో ప్రశ్నలు వేసుకుంటారు కొందరు. అయితే కొంత మంది సెలబ్రెటీలు మాత్రం ఏకంగా తాము లవ్ లో ఉన్నామని డైరెక్ట్ గా విషయమే చెప్పేస్తున్నారు. విషయం ఒప్పుకున్నా లేకపోయినా.. ప్రేమ పక్షుల్లా ఉన్న ఆ స్టార్లు ఎవరో ఓ సారి ఈ ఆర్టికల్ లో లుక్ వేసేద్దాం..

సిద్ధార్థ- అదితి రావు: ఈ జంట చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి కనిపిస్తే అందరూ లవ్ అంటూ డేటింగ్ అంటూ కామెంట్లు చేశారు. కానీ తర్వాత ఈ వార్తలపై ఖండిస్తూ మేము లవర్స్ కాదన్నారు. ఎంత చెప్పినా ట్రోలర్స్ పట్టించుకుంటారా? రెస్టారెంట్స్, పబ్లిక్ ఈవెంట్స్ లో చేతిలో చేయి వేసి తిరుగుతూ కనిపించడంతో మరింత ట్రోల్ చేయడం, రూమర్స్ స్పెడ్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఈ జంట అసలు నిజాన్ని ఒప్పుకోకతప్పలేదు. అంతేకాదు ఈ జంట తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందట. అయితే ఇద్దరి చేతిలో టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కొన్ని ప్రాజెక్ట్ లు ఉన్నాయని తెలుస్తోంది. మరి చూడాలి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో…

తమన్నా- విజయ్ వర్మ: తమన్నా విజయ్ వర్మల రిలేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే కావచ్చు. ఎప్పటి నుంచో వీరి మధ్య రిలేషన్ గురించి వార్తలు వస్తున్నాయి. వీరు కూడా ముందుగా ఖండించినా తర్వాత చేసేది ఏం లేక నిజం ఒప్పుకున్నారు. గతంలో తమన్నా ఈ విషయంపై స్పందించింది. విజయ్ వర్మ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది మిల్క్ బ్యూటీ. ఎట్టకేలకు ఈ రూమర్స్ నిజమేనని, YES YES IAM IN LOVE అని క్లారిటీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ. విజయ్ వర్మతో రిలేషన్‎లో ఉన్నానని స్పష్టం చేసింది తమన్నా. ఇక లస్ట్ స్టోరీస్ లో తొలిసారి కలిసి నటించిన ఈ జంట అప్పటి నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ లో ఈ జంట గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం, కలిసి ప్రయాణాలు చేయడం చేస్తుంటారు. దీంతో వీరి రిలేషన్ స్ట్రాంగ్ అనే నమ్మకం మరింత పెరిగిందట అభిమానుల్లో…

రష్మిక- విజయ్: గీతా గోవిందం సినిమాతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు విజయ్, రష్మిక. రౌడీ భాయ్ గా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో మాస్ ఆడియన్స్ నే కాదు క్లాసికల్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యాడు. అయితే ఈ సినిమాతో రష్మిక, విజయ్ మధ్య రిలేషన్ స్ట్రాట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా, క్యూట్ జోడీగా పేరు సంపాదించారు. మంచి కాంబినేషన్ అవడంతో ఆ తర్వాత కూడా కలిసి నటించారు. దీంతో ఇద్దరి మధ్య కచ్చితంగా రిలేషన్ ఉందని అంతా అనుకున్నారు. అయితే ఈ జోడీ పుకార్లను ఖండిస్తూ వస్తున్నా వారి ఫోటోలు, ప్రయాణాలు మాత్రం వీరిద్దరు రిలేషన్ లోనే ఉన్నారు అని తెలియజేస్తున్నాయి.