Homeఎంటర్టైన్మెంట్Tollywood Heros: తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే అయిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

Tollywood Heros: తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే అయిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

Tollywood Heros: టాలీవుడ్ ఇండస్ట్రీలో వారంతా స్టార్ హీరోలు. అంతేకాకుండా అన్నాదమ్ములు.. అక్కా చెల్లెళ్లు అవుతారు. దగ్గరి బంధుత్వం కలిగిన కొందరు సినీ సోదరులుకు తండ్రి ఒక్కడే.. కానీ తల్లులు వేరు.. అలాగే సోదరీమణులైన నటీమణులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే అంతా కలిసిమెలిసే ఉంటున్నారు. అంతేకాకుండా ఓ హీరో ఇద్దరు భార్యలను పెళ్లిళ్లు చేసుకుంటే వారి కుమారులు, కుమార్తెలు కూడా సినిమాల్లోకి వచ్చారు. రావడమే కాదు ఇద్దరు సమానంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు మనకు తండ్రి ఒక్కడే అయి ఉండి.. తల్లులు వేరైనా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. నాగచైతన్య-అఖిల్ లు మాత్రమే తెలుసు. కానీ వీరి లాగే మరికొంత మంది మనకు తెలియని నటులు ఉన్నారు. వారి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

Tollywood Heros
ntr, kalyan ram

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఒక్కసారి ఈ పరిశ్రమకు అలవాటుపడితే మళ్లీ వీడాలనిపించదు. అందుకే ఈ ఇండస్ట్రీని నమ్ముకొని ఎందరో తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఈ పరిశ్రమకు వచ్చి సక్సెస్ అయినవారూ.. ఫెయిల్ అయినవారూ.. ఉన్నారు. అయితే సక్సెస్ ఫుల్ లైఫ్ ను కొనసాగించిన వారు రెండు వివాహాలను చేసుకున్నారు. కొందరు హీరోలు కొన్ని పరిస్థితుల్లో రెండో వివాహం చేసుకున్నా.. ముందు వచ్చిన వారు అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. దీంతో అంతా కలిసిమెలిసే ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కుటుంబంలోనే కాకుండా మిగతా స్టార్ల కుటుంబంలోనూ ఇలాంటి వారున్నారు.

Also Read: Samantha: సమంత గ్లామర్ షో.. మత్తెక్కించింది, మతి పోగొట్టింది !

అకీరానందన్-మార్కోవిచ్ శంకర్: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ గురించి తెలియని వారుండరు. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. పవన్ రెండో భార్య రేణు దేశాయ్ కుమారుడు అకీరానందన్. అలాగే ఆయన మూడో భార్యకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరు మర్కోవిచ్ శంకర్. అకీరానందన్, మార్కోవిచ్ శంకర్ అన్నదమ్ములు అయినా వీరి తల్లులు వేరు. కానీ వీరిద్దరూ పండుగలు, పబ్బాల్లో సామరస్యంగా మెలగడం విశేషం.

Tollywood Heros
Akiranandan-Markovich Shankar

అఖిల్-నాగచైతన్య: ఏఎన్నార్ వారసుడైన అక్కినేని నాగార్జునకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య లక్ష్మి కుమారుడు నాగచైతన్య. రెండో భార్య అమల కుమారుడు అఖిల్. వీరిద్దరు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అన్యోన్యతను చాటుకుంటున్నారు.

naga chaitanya-akhil
naga chaitanya-akhil

జూనియర్ ఎన్టీఆర్-కల్యాణ్ రామ్: నందమూరి ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఇద్దరు అన్నాదమ్మలు. వీరి తండ్రి హరికృష్ణ. హరికృష్ణ మొదటి భార్య కొడుకు కల్యాణ్ రామ్ కాగా.. రెండో భార్య కుమారుడు జూనియర్ ఎన్టీఆర్. వీరు కూడా స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. నిజమైన బ్రదర్స్ లాగానే కొనసాగుతున్నారు.

kalyan ram, ntr
kalyan ram, ntr

మంచు లక్ష్మి- మనోజ్- విష్ణు: కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబుకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మోహన్ బాబు ముందుగా విద్యాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఈమెకు విష్ణు, మంచు లక్ష్మిలు జన్మించారు. ఆ తరువాత నిర్మలను రెండో వివాహం చేసుకున్నారు. ఈమెకు మంచు మనోజ్ జన్మించారు.

Manchu Lakshmi- Manoj- Vishnu
Manchu Lakshmi- Manoj- Vishnu

నగ్మా-జ్యోతిక: సౌత్ సినిమా ఇండస్ట్రీలో వెలుగు వెలిగారు నగ్మా, జ్యోతికలు స్టార్ హీరోలందరితో నటించిన నగ్మాకు స్వయానా చెల్లెలు వరుస జ్యోతిక అని అందరికీ తెలుసు. అయితే వీరికి తండ్రి ఒక్కరే కానీ తల్లులు వేరు. జ్యోతిక ఠాగూర్, మాస్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

nagma- jyothika
nagma- jyothika

అర్జున్ కపూర్-జాన్వి కపూర్: అలనాటి అందాల తార శ్రీదేవి ఇప్పుడు మనమధ్య లేకపోయినా ఆమె గుర్తులు మిగిలే ఉన్నాయి. ఆమె కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా సాగుతోంది. జాన్వి కపూర్ తండ్రి బోనీ కపూర్. అయితే బోనీ కపూర్ మొదటి భార్యకు అర్జున్ కపూర్ జన్మించాడు. అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ అన్నా చెల్లుళ్లు అయినా వీరికి తల్లులు వేరు.

Arjun Kapoor-Janvi Kapoor
Arjun Kapoor-Janvi Kapoor

Also Read:Dalapathi: షాకింగ్.. దళపతి సినిమాని వదులుకున్న హీరోలు వీళ్లేనా!

షాహిద్ కపూర్-ఇషాన్ ఖట్టర్: వీరిద్దరి తల్లి ఒక్కరే. ఆమెనే ‘నీలిమా అజీమ్’. నీలిమ మొదట పంకజ్ కపూర్ ను వివాహం చేసుకుంది. వీరికి ‘షాహిదీ కపూర్ ’ పుట్టాడు. ప్రస్తుతం ఇతడు బాలీవుడ్ లో ప్రముఖ హీరోగా ఉన్నారు. అయితే నీలిమ-పంకజ్ కపూర్ విభేదాలతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నీలిమా.. ‘రాజేష్ ఖట్టర్’తో రెండో వివాహాన్ని చేసుకుంది. వీరికి పుట్టిన సంతానమే ‘ఇషాన్ ఖట్టర్’. ఇప్పుడు ఇతడు బాలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్నాడు.

ఇలా తల్లులు, తండ్రులు వేరైనా సినీ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ సోదరసోదరీమణులతో అంతే ఆప్యాయంగా ఈ ప్రముఖులు ఉంటున్నారు. వారి ప్రేమను పంచుతూ.. పొందుతూ సామారస్యంగానే జీవిస్తున్నారు.
Recommended videos

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular