Heroines Who Lost Husband: భార్య బతికుండగానే భర్త చనిపోతే వైధవ్యం అంటారు. అది మహిళలకు శాపమే. భర్త లేని ఆడదానికి సమాజంలో విలువ ఉండదు. చిన్నతనంగా చూస్తారు. ఎలాంటి శుభకార్యాలకు పిలవరు. కానీ ఇదంతా ఒకప్పటి ట్రెండ్. ఇప్పుడు కాలం మారిపోయింది. సాంకేతికత పెరిగిపోయింది. దీంతో భర్తలు లేని వారే అధికారాలు చెలాయిస్తున్నారు. వీరబ్రహ్మంగారు చెప్పినట్లు ముండమోపులే పదవుల్లోకి వస్తారని ఆనాడే చెప్పారు. కానీ భర్త ఉంటేనే ఆడదానికి నిండుదనం ఉంటుంది. మంచి హోదా ఉంటుంది. అందుకే కలకాలం భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా జివించాలనే పెళ్లినాటి ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇది అందరి విషయంలో వీలు కాకపోవచ్చు. మన సినిమా పరిశ్రమలో చాలామందికి వైధవ్యమే మిగిలింది. తమ భర్తలను కోల్పోయి వారు మోడువారిన చెట్టులా మారారు.ఒకప్పటి హీరోయిన్, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టు సహజనటిగా పేరుతెచ్చుకున్న జయసుధ నితిన్ కపూర్ ను వివాహం చేసుకుంది. కానీ ఆమె భర్త 2017లో అకాల మరణం చెందారు. అప్పటి నుంచి ఆమెకు వైధవ్యమే మిగిలింది. మరో నటి సుమలత కన్నడ నటుడు అంబరీష్ ను పెళ్లి చేసుకుంది. వారిద్దరు శ్రీమంజునాథలో భార్యాభర్తలుగా నటించారు.
Also Read: Koffee With Karan 7 Trailer: విడాకులపై సంచలన విషయాలు పంచుకున్న సమంత.. వైరల్

ఆమె భర్త కూడా 2018లో కన్ను మూశారు. ఇక ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ కూడా ఊపిరితిత్తుల వ్యాధితో మృతిచెందడం బాధాకరమే. ఇలా వారి జీవితంలో తమ భర్తలను దూరం చేసుకోవడం వారికి దుఖాన్నే మిగిల్చింది.మంచి డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుని ఒకప్పటి హీరోయిన్ భానుప్రియ భర్త కూడా చనిపోయారు. ఆమె భర్త ఆదర్శ్ కౌశల్ 2005లో దూరమయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న రోహిణి కూడా తన భర్త రఘువరన్ ను 2008లోనే కోల్పోయింది. దీంతో ఆమెకు వైధవ్యమే మిగిలింది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో రాణిస్తున్న సురేఖా వాణి కూడా తన భర్తను దూరం చేసుకుంది. ఆమె భర్త తేజ 2018లో కన్నుమూశారు.

మరో సీనియర్ నటి కవితకు కూడా బొట్టు దూరం కావడం సంచలనం కలిగించింది. ఆమె భర్త దశరథ్ కరోనా కారణంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీహరి డ్యాన్సర్ డిస్కోశాంతి భర్త. శ్రీహరి అనారోగ్య కారణాలతో 2013లో చనిపోయారు. ఎన్నో సినిమాల్లో నటించి తనదైన శైలిలో రాణించిన శ్రీహరి లేని లోటు తీర్చలేనిది. ఇలా భర్తలను దూరం చేసుకున్న నటీమణులు చాలా మంది ఉన్నారు. దీంతో వారి భవిష్యత్ గురించి బాధ పడుతున్నారు. భర్త ఉండగా ఏ లోటు లేకుండా ఉన్న వారికి ఒంటరితనం శాపంగా మారుతోంది.
Also Read:Naga Chaitanya- Nagarjuna: నాగార్జున చేసిన పొరపాటు వల్ల రిస్క్ లో పడ్డ నాగచైతన్య కెరీర్