Tollywood Films: ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ తో సినిమాల సందడి మొదలైంది. ఈ సంక్రాంతికి రాజాసాబ్, మన శంకర్ వరప్రసాద్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి అనే 5 సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజా సాబ్’ సినిమా మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఈ సంక్రాంతి సీజన్ హీరోలందరికి కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇక సంవత్సరం మార్చి నెలలో భారీ సినిమాలో రిలీజ్ అవుతున్నాయి అంటూ గత కొన్ని రోజుల నుంచి ప్రచారమైతే జరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఒక్కో సినిమా తమ రిలీజ్ డేట్ లను పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘పెద్ది’ సినిమా మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినప్పటికి ఇంకా షూట్ చేయాల్సిన 15 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉండడం వల్ల ఆ 15 రోజుల షూట్ అయిపోవాలి.
దాని పోస్ట్ ప్రొడక్షన్ అవ్వాలి అంటే అనుకున్న టైమ్ కి వచ్చే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా మేలో గానీ, జూన్ లో గాని రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి… ఇక నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా సైతం మార్చి 26వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటు అనౌన్స్ చేశారు.
కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే ప్యారడైజ్ సినిమాని కూడా పోస్ట్ పోన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. కారణం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. ముఖ్యంగా సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక 40 రోజుల పాటు ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె జరిగింది. దానివల్ల నెల రోజులపాటు షూటింగ్స్ ఏమీ జరగకుండా వాయిదా పడ్డాయి.
దాంతో సినిమా రిలీజ్ డేట్లలో చాలావరకు అవకతవకలు జరుగుతున్నాయి అంటూ కొంతమంది సినిమా మేధావులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మార్చి నెలలో పెద్ది, పారడైజ్ సినిమాల మధ్య పెద్ద ఫైట్ ఉండబోతుంది అనుకున్నప్పటికి ఈ రెండు సినిమాలు సైతం పోస్ట్ పోన్ అవ్వడంతో మిగతా సినిమాలను ఆ డేట్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పెద్ది, ప్యారడైజ్ సినిమాల కొత్త రిలీజ్ డేట్లు ఏంటి అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…