Vamsi Paidipally : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీసిన కూడా అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తే అదో తృప్తి అంటున్నారు మరి కొంతమంది దర్శకులు. అందుకే ఇక్కడ ఎంత క్రేజ్ ఉన్నా ఒకసారి బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. తాజాగా ఇదే క్రమం లో మరో దర్శకుడు బాలీవుడ్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి వేసిన విత్తనాన్ని కాస్త చెట్టుగా మార్చారు సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ వంటి దర్శకులు. ఈ దారిలోనే పయనించడానికి రెడీ అవుతున్నారు మరికొంతమంది తెలుగు దర్శకులు. ప్రస్తుతం బాలీవుడ్ లో తెలుగు దర్శకులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ నుంచి దర్శకులు ఎవరైనా వస్తున్నారు అని తెలిసిన వెంటనే అక్కడి హీరోలు కర్చీఫ్ వేసేస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగు వాళ్ళ క్రేజ్ అక్కడ ఓ రేంజ్ లో ఉంది.మన తెలుగు దర్శకులకు బాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగు దర్శకులు బాలీవుడ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ తో వీరసింహారెడ్డి సినిమా చేసిన తర్వాత నేరుగా గోపీచంద్ మలినేని బాలీవుడ్లో సినిమా చేస్తున్నారు. ఇక గదర్ 2 సినిమా తర్వాత సన్నీడియోల్ చేస్తున్న జాట్ పై ప్రేక్షకులలో అంచనాలు బాగా ఉన్నాయి. ఇక మరొక దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ప్రస్తుతం బాలీవుడ్లో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ప్రాజెక్టు ఓకే చేయించుకునే పనిలో ఉన్నారు వంశీ పైడిపల్లి. తాజాగా దర్శకుడు బాబి కూడా బాలీవుడ్ వెళ్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల కింద మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాబి లేటెస్ట్ గా సంక్రాంతికి బాలయ్యతో డాకు మహారాజు సినిమాతో మరొకసారి బాక్సాఫీస్ దగ్గర మాస్ హిట్ అందుకున్నారు. డాకు మహారాజు సినిమా తర్వాత బాబి తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబి ఓ హిందీ సినిమా కోసం కథ రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. బాబి తర్వాతి సినిమాపై పూర్తిగా క్లారిటీ రావాలంటే మరో రెండు నెలలు పడుతుంది.ఈ మధ్యకాలం లో టాలీవుడ్ దర్శకులు పాన్ ఇండియా సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందుకోవడంతో తెలుగు దర్శకులకు బాలీవుడ్ లో బాగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకులు కూడా డైరెక్ట్ గా బాలీవుడ్ లో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.