Homeఎంటర్టైన్మెంట్కరోనా క్రైసిస్ చారిటీకి విరాళాల వెల్లువ

కరోనా క్రైసిస్ చారిటీకి విరాళాల వెల్లువ

కరోనా విపత్తు కారణంగా షూటింగ్ లు లేక ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడంలో భాగంగా ఏర్పాటు చేసిన “కరోనా క్రైసిస్ చారిటీ “కి సినీ వర్గాలనుంచి అపూర్వ స్పందన వస్తోంది. చిరంజీవి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఈ నిధికి పలువురు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తెలుగు సినీ రంగం లో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా చైతన్యం ,సంఘీభావం వెల్లివిరుస్తోంది. తెలుగు చిత్రసీమకు చెందిన బడా ,చోటా స్టార్స్ అందరూ కదిలి వచ్చి సి. సి. సి (కరోనా క్రైసిస్ చారిటీ ) కి ఆర్ధిక సాయం అందిస్తున్నారు.

మెగా స్టార్ చిరంజీవి ఇచ్చిన కోటి రూపాయలతో ఆరంభం అయిన ఈ సి. సి. సి కి దగ్గుబాటి ఫామిలీ ,నాగార్జున కూడా కోటి రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఇక మహేష్ బాబు , ఎన్ టి ఆర్ ,నాగ చైతన్య, రామ్ చరణ్ పాతిక , ముప్పై లక్షలు తగ్గకుండా ఇచ్చారు .

ఇపుడు వారికి ధీటుగా హీరో రవితేజ, మెగా హీరో వరుణ్ తేజ్ రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. . ఇది బాధను కొలవడం కాదు, సినీ కార్మికుల అవసరాలను తీర్చడంలో తోడ్పాటు మాత్రమే అని వారు పేర్కొన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అందరూ ఇంటి పట్టునే సురక్షితంగా ఉండాలని కోరారు.

ఇదే సమయంలో తాజాగా ` హిట్ ` మూవీతో సక్సెస్ సాధించిన యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా తన వంతుగా 5లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. నేడు ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకొని ఆయన ఈ సాయం అందించడం జరిగింది..తాజాగా హీరో శర్వానంద్ సి . సి . సి. కోసం 15లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. డైలీ వర్కర్స్ శ్రేయస్సు కోసం ఆ డబ్బులు ఉపయోగించాల్సిందిగా ఆయన కోరాడు.

సినీ రంగంలో ఇపుడిపుడే హీరో గా తన ఉనికిని చాటుకొంటున్న `ఆర్ ఎక్స్ 100 `హీరో కార్తికేయ కూడా తన వంతు సాయంగా 2 లక్షలు ఇచ్చాడు. అదే స్ఫూర్తి తో టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా 2 లక్షలు ఇచ్చి తన ఉదారత చాటు కొన్నాడు.

ఇక ఆశ్చర్యకరం గా వర్ధమాన హీరోయిన్ లు అయిన లావణ్య త్రిపాఠి , ప్రణీత (అత్తారింటికి దారేది ఫేమ్ ) కూడా ముందుకు వచ్చి లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేసే పోరాటంలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన సి . సి . సి (కరోనా క్రైసిస్ చారిటీ ) కి మెగా మేనల్లుడు సాయి (ధరమ్ ) తేజ్ తన వంతు సాయం గా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చిన సాయి తేజ్ తాజాగా, రోజువారి సినీ కార్మికుల కోసం మరో పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular