Shiva Shankar: శివశంకర్​ మాస్టర్​ మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం.. రాజమౌళి, చిరు, బాలయ్య భావోద్వేగభరిత ట్వీట్​

Shiva Shankar: ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో కరోనాతో మృతి చెందుతున్న వారు ఎక్కువయ్యారు. తాజాగా, మరో రత్నం ఈ మహమ్మారికి బలైపోయింది. గత కొంతకాలంగా కొవిడ్​తో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్​ శివశంకర్​.. ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. అయితే, ఆయన చనిపోయే ముందు కరోనా పరీక్ష్లో నెగిటివ్​ వ్చచినట్లు తెలిసింది. సినిమాల్లో కొరియోగ్రాఫర్​గా మాత్రమే కాకుండా, పలు షోలకు న్యాయ నిర్ణేతగా, సినిమాల్లో నటుడిగానూ తన సత్తా చాటారు శివశంకర్​ మాస్టర్​. https://twitter.com/megopichand/status/1465021064237379589?s=20 Sad […]

Written By: Raghava Rao Gara, Updated On : November 29, 2021 8:43 am

Shiva Shankar Master

Follow us on

Shiva Shankar: ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో కరోనాతో మృతి చెందుతున్న వారు ఎక్కువయ్యారు. తాజాగా, మరో రత్నం ఈ మహమ్మారికి బలైపోయింది. గత కొంతకాలంగా కొవిడ్​తో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్​ శివశంకర్​.. ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. అయితే, ఆయన చనిపోయే ముందు కరోనా పరీక్ష్లో నెగిటివ్​ వ్చచినట్లు తెలిసింది. సినిమాల్లో కొరియోగ్రాఫర్​గా మాత్రమే కాకుండా, పలు షోలకు న్యాయ నిర్ణేతగా, సినిమాల్లో నటుడిగానూ తన సత్తా చాటారు శివశంకర్​ మాస్టర్​.

https://twitter.com/megopichand/status/1465021064237379589?s=20

కాగా, శివశంకర్​ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించేందుకు హైదరాబాద్​ మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకెల్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.  ఇకపై ఆయన లేరన్న వార్త విని చిరంజీవి, బాలకృష్ణ, పవన్​ కళ్యాణ్​ వంటి స్టార్​తో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్​మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

తాజాగా, దర్శకుడు రాజమౌళి ఆయన మృతిపై స్పందిస్తూ.. శివశంకర్​ మాస్టర్​ చనిపోయారని తెలిసి బాధగా ఉందని. మగధీర కోసం ఆయని కలిసి పని చేసిన అనుభవం ఎంతో గొప్పదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

ఇండియా ఫిల్మ్​ ఇండస్ట్రీలో దాదాపు 10 భాషల్లో పనిచేసిన అనుభవం శివశంకర్ మాస్టర్ సొంతం. 800 పైగా సినిమాలకు కొరియోగ్రఫీ అందించగా… దాదాపు 30 సినిమాల్లో నటనతో మెప్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న శివశంకర్‌ మాస్టర్‌.. చెన్నైలో పుట్టారు. సలీమ్‌ మాస్టర్‌ దగ్గర శిష్యరికం చేశారు. 2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు శివశంకర్ మాస్టర్.