
Nagarjuna Meets YS Jagan: ఏపీ సీఎం జగన్ తో భేటీ కావడానికి హీరో నాగార్జున తాడేపల్లి పోయి మరి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశాడు. అసలు ఉన్నట్టు ఉండి నాగ్ ఎందుకు జగన్ కలిసినట్టు ? గతంలో జగన్ తో చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కలిసి భేటీ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సారి మాత్రం నాగార్జున ఒక్కరే జగన్ ను కలవడంతో అందరిలో ఆసక్తి కలిగింది. అయితే విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడారు
నాగార్జున మాటల్లో.. ‘విజయవాడ రాజధాని రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్ నా శ్రేయోభిలాషి. జగన్ ను చూసి చాలా రోజులవుతుంది. అందువల్ల విజయవాడ వచ్చాను. జగన్ తో కలిసి లంచ్ చేశాను’ అంటూ నాగ్ చెప్పుకొచ్చాడు. అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరాడు. ఇక
నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు సీఎంతో భేటీ అయ్యారు.
ఇక భేటీలో ప్రధానంగా ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అయితే సడెన్ గా సీఎంతో నాగార్జున, ఇతర సినీ సెలబ్రిటీలు భేటీ కావడం వెనుక మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నాడట. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో అమ్మాలనే నిర్ణయం పై ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ప్రభుత్వ వైఖరి పై సినీ ఇండస్ట్రీలో ఉన్న అనేక అనుమానాలను అపోహలను కూడా ఈ భేటీలో చర్చించారు.
అలాగే పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన అంశం పై కూడా చర్చించారు. పవన్ తో తమకు ఎటువంటి సంబంధం లేదు అని నాగ్ చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో సినిమా టికెట్ల రేట్లును పెంచుకునే వెసులుబాటును కల్పించాలని నాగార్జున కోరాడు. అందుకు జగన్ కూడా సానుకూలంగా స్పదించాడట.
Also Read: నాగార్జున కోసం జగన్ అంత పని చేశాడా?