Site icon OkTelugu

Tollywood 2026 Upcoming Movies: ఈ సంవత్సరం అన్ని ఇండస్ట్రీ హిట్లు వస్తాయా..? కారణం ఏంటంటే..?

Tollywood 2026 Upcoming Movies

Tollywood 2026 Upcoming Movies

Tollywood 2026 Upcoming Movies: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోలకు మాత్రమే క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు వాళ్ళ మార్కెట్ ను పెంచుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు… ఇక ఇండస్ట్రీ లో గత 50 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న గుర్తింపు మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. చిరంజీవి గత కొన్ని సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు. దాంతో తన అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. ఈ ఇయర్ సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ మన శంకర్ వరప్రసాద్’ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేసిన సినిమాలు మరొకెత్తుగా మారుతున్నాయి… ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సక్సెస్ అందించిన చిరంజీవి గురించి ప్రతి ఒక్కరు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. సంవత్సరం ప్రారంభంలోనే ఇండస్ట్రీకి భారీ సక్సెస్ లను కట్టబెట్టాడు. కాబట్టి ఈ ఇయర్ మొత్తం రాబోయే సినిమాలన్నీ సక్సెస్ సాధిస్తూ తెలుగు ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశమైతే ఉందని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ప్రస్తుతం చిరంజీవి- బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. అలాగే ఈ సంవత్సరం సమ్మర్లో విశ్వంభర సినిమాn సైతం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కాబట్టి ఈ సంవత్సరం చిరంజీవి తన రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే మన శంకర్ వరప్రసాద్ సక్సెస్ ని సాధించింది కాబట్టి విశ్వంభర కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తే చిరంజీవి క్రేజ్ మరోసారి టాప్ లెవెల్ కి వెళుతుంది…

అలా కాకుండా విశ్వంభర సినిమా తేడా కొడితే మాత్రం చిరంజీవి మరోసారి భారీ విమర్శలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితైతే రావచ్చు… మరిప్పుడు విశ్వంభర పరిస్థితి ఏంటి అంటూ మెగా అభిమానులు సైతం కొంతవరకు భయాందోళనలో ఉన్నారు.

ఈ మూవీ గత ఏడాది సమ్మర్లోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ మూవీ సిజి వర్క్ అంత పర్ఫెక్ట్ గా రాలేదనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి మరోసారి ఆ సినిమాకి సీజీ వర్క్ చేయించాలని దర్శకుడుతో చెప్పాడు. దాంతో డైరెక్టర్ అవే పనుల్లో ఉన్నాడు. మరి ఇప్పటికైనా మూవీ బాగా వచ్చిందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Exit mobile version