https://oktelugu.com/

Tollywood: ఈ దీపావళి ముగ్గురు హీరోలకు భారీ సక్సెస్ ను ఇచ్చిందా..?

లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2024 / 07:00 PM IST

    Tollywood(12)

    Follow us on

    Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలను మనం చూశాం…కానీ కుర్ర హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకొని మంచి కంటెంట్లతో సినిమాలు చేస్తూ భారీ విజయాలను అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే దీపావళి కానుకగా ‘క ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం…ఈయన చేసిన క సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మొదటిసారి 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసిన సినిమాగా కిరణ్ అబ్బవరం కెరియర్ లో ఒక గొప్ప రికార్డును కూడా క్రియేట్ చేసి పెట్టింది. ఇక మొదటిసారి 50 కోట్ల క్లబ్ లో చేరిన కిరణ్ అబ్బవరం తన తదుపరి సినిమాతో మరింత హైప్ ను క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మంచి కథలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు…

    దుల్కర్ సల్మాన్

    లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నిజానికి ఏ పాత్రలో అయినా అలవోకగా నటించి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు దుల్కర్ సల్మాన్… పాజిటివ్ క్యారెక్టర్ నెగటివ్ క్యారెక్టర్ అనే తేడా లేకుండా ఎలాంటి పాత్రలో అయిన నటించి మెప్పిస్తాడు. మరి అలాంటి హీరో ఈ దీపావళి కి వచ్చి భారీ కలెక్షన్లను రాబట్టాడు. ఇక తన ఎంటైర్ కెరియర్ లో 100 కోట్ల క్లబ్ లో చేరడం అనేది ఇదే మొదటిసారి కావడం వల్ల దుల్కర్ సల్మాన్ చాలా ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది…

    శివ కార్తీకేయన్
    తమిళనాడులోని ఆర్మీ మేజర్ ఆఫీసర్ అయిన ‘ముకుంద్ వరద రాజన్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అమరన్..ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇక శివ కార్తికేయన్ నటన అమోఘం అనే చెప్పాలి.

    సినిమాలో ఆయన్ని చూస్తున్నంత సేపు ఆర్మీ మేజర్ ముకుంద్ క్యారెక్టర్ ని డైరెక్ట్ గా అనిపించింది. ఇక తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటి వరకు 300 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమాలను చేయలేదు. కానీ అమరన్ సినిమాతో 300 కోట్ల టార్గెట్ ను రీచ్ అయిన శివ కార్తికేయన్ ఈ సినిమాతో ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేశాడనే చెప్పాలి…

    ఇలా ఈ దీపావళి ఈ ముగ్గురు హీరోలకి చాలా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి…