OkTelugu Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుతు’ లిరికల్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 2 గంటల్లోపే 1.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది సౌత్ ఇండియా రికార్డు. అలాగే 1.1 మిలియన్ల లైక్స్ వచ్చాయి. దీనికి అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాట కూడా తానే పాడాడు. విజయ్, పూజా డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.

మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. తన పేరుతో ఫోన్లు, మెసేజ్‌లు పంపిస్తున్న నంబర్ తనది కాదని హీరోయిన్ డింపుల్ హయతి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఆ నంబర్‌కు ఎవరూ రెస్పాండ్ కావొద్దని, వెంటనే బ్లాక్ చేయాలని కోరింది. హయతి ప్రస్తుతం రవితేజతో కలిసి ‘ఖిలాడి’ సినిమాలో నటించింది. ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలోనూ ఓ సాంగ్‌లో డింపుల్ తళుక్కున మెరిసింది.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ షూటింగ్ పూర్తైందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో పెళ్లి వేదికపై శర్వానంద్ నమస్కారం చేస్తున్నట్లు కనిపించాడు.

Also Read: ఒకే హీరోకు భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్స్ వీళ్ళే !
కాగా హీరో-హీరోయిన్‌తోపాటు చిత్రంలో ప్రధాన తారాగణం మొత్తం పోస్టర్‌లో కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: ‘సుందరకాండ’ సెకండ్ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు ?
[…] […]
[…] Ghani Release Date: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 25న థియేటర్లలో సినిమా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ సందడి చేయనుంది. […]